నాలుగేళ్ల కనిష్టానికి జేబీఎఫ్‌ ఇండస్ట్రీస్‌

నాలుగేళ్ల కనిష్టానికి జేబీఎఫ్‌ ఇండస్ట్రీస్‌

ఈ ఏడాది మూడో త్రైమాసికంలో నికర నష్టం ప్రకటించిన తరువాత పతన బాటలో సాగుతున్న జేబీఎఫ్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ మరోసారి అమ్మకాలతో డీలాపడింది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 5 శాతం పతనమై రూ. 109 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 104 వరకూ జారింది. ఇది నాలుగేళ్ల కనిష్టంకాగా.. ఇంతక్రితం 2014 మే27న ఈ స్థాయిలో ట్రేడయ్యింది. 
44 శాతం పతనం
ఫిబ్రవరి 8న జేబీఎఫ్‌ క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాలు ప్రకటించింది. క్యూ3లో కంపెనీ రూ. 16 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అప్పటినుంచీ ఈ కౌంటర్‌ 44 శాతం క్షీణించింది. కాగా.. పాలియస్టర్‌ ఆధారిత ప్రొడక్టులు రూపొందించే ఈ సంస్థ మంగళూరులో ఏర్పాటు చేసిన ప్లాంటు ఆర్థిక సమస్యలతో నిలిచిపోగా.. అనుబంధ సంస్థ జేబీఎఫ్‌ ఆర్‌ఏకే సైతం మూతపడింది. దీంతో కంపెనీకి రుణ చెల్లింపుల్లో సమస్యలు సైతం ఎదురై రుణ పునర్వ్యవస్థీకరణ బాట పట్టింది.Most Popular