ఆర్బిట్రేషన్‌పై పట్టు- రిలయన్స్‌ ఇన్‌ఫ్రా అప్‌

ఆర్బిట్రేషన్‌పై పట్టు- రిలయన్స్‌ ఇన్‌ఫ్రా అప్‌

ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(డీఎంఆర్‌సీ)పై గెలుపొందిన ఆర్బిట్రేషన్‌ అవార్డును అమలు చేయాల్సిందిగా అభ్యర్థిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన వార్తలతో రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 4.4 శాతం జంప్‌చేసి రూ. 443 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 448ను సైతం అధిగమించింది.
అనుబంధ సంస్థ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ద్వారా ఆర్బిట్రేషన్‌ అవార్డును అమలు చేయాల్సిందిగా అభ్యర్థిస్తూ హైకోర్టులో పిటీషన్‌ వేసినట్లు రిలయన్స్‌ ఇన్‌ఫ్రా పేర్కొంది. ఆర్బిట్రేషన్‌ అవార్డులో భాగంగా డీఎంఆర్‌సీ మొత్తం రూ. 5,200 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని తెలియజేసింది.Most Popular