ప్చ్‌.. ఎంఎంటీసీ బోనస్‌ నచ్చలేదు!

ప్చ్‌.. ఎంఎంటీసీ బోనస్‌ నచ్చలేదు!

వాటాదారులకు బోనస్‌ షేర్ల జారీ ప్రతిపాదనను తెరమీదకు తీసుకురావడంతో ఇటీవల ర్యాలీ బాటలో సాగిన ఎంఎంటీసీ కౌంటర్‌ ప్రస్తుతం అమ్మకాల తాకిడిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4 శాతం పతనమైంది. రూ. 64 దిగువన ట్రేడవుతోంది. 
1:2 బోనస్‌
ప్రభుత్వ రంగ ట్రేడింగ్‌ దిగ్గజం ఎంఎంటీసీ బోర్డు సోమవారం మీటింగ్‌లో 1:2 బోనస్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఇన్వెస్టర్లు నిరాశకు లోనైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వాటాదారుల దగ్గరున్న ప్రతీ 2 షేర్లకూ 1 షేరుని ఫ్రీ(బోనస్‌)గా జారీ చేసేందుకు బోర్డు నిర్ణయించింది. 1:1 బోనస్‌పై అంచనాలతో ఈ కౌంటర్‌ గత వారం చివరి రెండు రోజుల్లో 26 శాతం జంప్‌చేసిన సంగతి తెలిసిందే. Most Popular