బినానీ ఇండస్ట్రీస్ అప్పర్‌ సర్క్యూట్‌!

బినానీ ఇండస్ట్రీస్ అప్పర్‌ సర్క్యూట్‌!

రుణ భారంతో దివాలా చట్ట పరిధికి చేరిన బినానీ సిమెంట్ కొనుగోలుకి దిగ్గజాలు పోటీపడుతుండటంతో మాతృ సంస్థ బినానీ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం బీఎస్ఈలో బినానీ ఇండస్ట్రీస్‌ 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 98 వద్ద ఫ్రీజయ్యింది. 
అల్ట్రాటెక్ ముందంజ
రుణాలు చెల్లించలేని స్థితికి చేరిన బినానీ సిమెంట్‌ కొనుగోలుకి ఇప్పటికే దాల్మియా భారత్‌, డీమార్ట్‌ దమానీ తదితర సంస్థలు బిడ్స్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆదిత్య బిర్లా గ్రూప్‌ దిగ్గజం అల్ట్రాటెక్‌  బిడ్‌ విలువను పెంచే బాటలో రుణదాతలకు కంఫర్ట్‌ లెటర్‌ను అందించినట్లు వెల్లడికావడంతో మరోసారి బినానీ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ జోరందుకున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. Most Popular