ఫేస్‌బుక్‌తో అమెరికా మార్కెట్లు బుక్‌!

ఫేస్‌బుక్‌తో అమెరికా మార్కెట్లు బుక్‌!

ఫేస్‌బుక్‌ కారణంగా టెక్నాలజీ దిగ్గజాలలో భారీ అమ్మకాలు నమోదుకావడంతో ప్రధానంగా సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అంతేకాకుండా నేటి నుంచి ప్రారంభంకానున్న ఫెడ్‌ పాలసీ సమావేశాలు, అమెరికా టారిఫ్‌లపై జీ20 దేశాల అజెండా వంటి అంశాలు సైతం సెంటిమెంటును బలహీనపరచడంతో డోజోన్స్‌ 336 పాయింట్లు(1.35 శాతం) పతనమై 24,611 వద్ద నిలిచింది. ఎస్‌అండ్‌పీ 39 పాయింట్లు(1.4 శాతం) తిరోగమించి 2,713 వద్ద ముగియగా...  నాస్‌డాక్‌ 138 పాయింట్లు(1.85 శాతం) పడిపోయి 7,344 వద్ద స్థిరపడింది.
టెక్నాలజీపై నియంత్రణలు?
అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా  5 కోట్లమంది ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను అక్రమంగా వినియోగించారన్న అంశంపై యూఎస్‌, యూరోపియన్‌ న్యాయశాఖ అధికారులు ఫేస్‌బుక్‌ చీఫ్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ను విచారించారన్న అంశం ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమైనట్లు తెలుస్తోంది. ఇకపై ఫేస్‌బుక్‌సహా టెక్నాలజీ దిగ్గజాలపై నియంత్రణలు పెరగవచ్చన్న అంచనాలు టెక్నాలజీ కౌంటర్లను దెబ్బతీసినట్లు నిపుణులు చెబుతున్నారు.
దిగ్గజాలు బోర్లా
టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకోవడంతో ఫేస్‌బుక్‌ 7 శాతం దిగజారింది. 2014 మార్చి తరువాత ఇదే అత్యధిక నష్టంకాగా..  అల్ఫాబెట్‌ 3 శాతం, మైక్రోసాఫ్ట్‌ 2 శాతం, యాపిల్‌ 1.5 శాతం చొప్పున పతనమయ్యాయి. దీంతో మార్కెట్లు నీరసించినట్లు నిపుణులు పేర్కొన్నారు.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');