రిటైర్‌మెంట్ తర్వాత సుఖమయ జీవితానికి ఇదే దగ్గర దారి

రిటైర్‌మెంట్ తర్వాత సుఖమయ జీవితానికి ఇదే దగ్గర దారి

ఒక వయసు దాటిన తర్వాత రిటైర్‌మెంట్ ఆలోచనలు వస్తుంటాయ్. కొంతమంది చివరి వరకూ పని చేయాలనే లక్ష్యంతో ఉంటారు కానీ అది సాధ్యపడేది కాదు. విరామం ఎరుగకుండా ఆదాయం సాధించడం కుదిరే పని కాదు. అందుకే రిటైర్‌మెంట్ తర్వాత జీవితం సాఫీగా సాగిపోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. సంపాదన మొదలైన మొదటి ఇరవైఏళ్లలో రాబడి అంతా రోజువారీ ఖర్చులకు,  పిల్లల విద్యాభ్యాసాలకు, పెళ్లిళ్లకు సరిపోతుంటుంది. దాదాపుగా 40 ఏళ్లు దాటిన తర్వాతే అరే..మనం కొద్దిగా రిటైరైన తర్వాత ఏం చేయాలో ఆలోచించకుండా ఖర్చు పెట్టేశామే అన్పిస్తుంటుంది..కానీ కాలం తిరిగి రాదు కదా..! 
కానీ ముందు విశ్రాంతి తీసుకుందామనుకున్న వయసుకి సరిపడా దాచాలంటే ఎంత పొదుపు చేయాలనేది కూడా చాలామందికి పెద్దగా తెలియకపోవచ్చు. అసలు రిటైర్మెంట్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకుంటే సరిపోతుంది అనే సందేహాలు రావడం సహజం. అందుకే ముందే మేలుకుని..ఎప్పటికప్పుడు వాయిదా వేసే మనస్తత్వాన్ని వీడితేనే భవిష్యత్తు బ్యూటిఫుల్‌గా ఉఁటుంది లేదంటే, వర్తమానం భవిష్యత్తుగా మారడానికి ఎంతో సమయం పట్టదు. ఉదాహరణకు 60వ ఏట విరామం తీసుకుందామని అప్పటికి 5కోట్ల రూపాయలు సరిపోతాయని అనుకుంటే, అది కూడా 40వ ఏట ఆ ఆలోచన వస్తే నెలకి ఎంత దాచాలో తెలుసా...జస్ట్ రూ.50వేలు..అది కూడా 12శాతం వడ్డీ అంచనాతో..ఇంత దాచడం ఇప్పుడు సామాన్యులకు కాదు కదా..మధ్యతరగతి జనాలకు కూడా సాధ్యపడదు. అదే మీరు 30వ ఏట సంపాదన ఆరంభిస్తే..నెలకి 15వేలు మాత్రమే పొదుపు చేయాల్సి వస్తుంది. అంటే ఈ ఉదాహరణ మనకి ఏం తెలియజేస్తుందంటే..ఎంత తక్కువ వయసులో పొదుపు అంత ఎక్కువ మదుపు చేస్తుందనేది. ఇది పౌనఫున్య పొదుపు( COMPOUND INTREST)కి ఉన్న శక్తి. 

మరిప్పుడు ఎలా ప్లానింగ్ చేసుకోవాలో చూద్దాం
ముందు ఏ వయసులో రిటైర్ అవ్వాలో నిర్ణయించుకోవాలి. అంటే ఇక ఆ వయసులో మీరిక పని చేయలేరు అనే విషయాన్ని అంగీకరిస్తున్నట్లు,ఆ సమయంలో మీరింకో వృత్తి ఎంచుకోవచ్చు..అది ఆదాయం తెచ్చిపెట్టేది కావచ్చు, కాకపోవచ్చు సదరు వయసులో మీరు ఎలా జీవించాలని అనుకుంటున్నారు..నిరాడంబరంగానా..ఇంకా దర్జాగానా..లేక కనీస అవసరాలు తీరితే చాలా దీనికోసం ప్రస్తుత ఖర్చులను రిటైర్‌మెంట్ దశ నుంచి తొలగించాలి. ఎఁదుకంటే ఇప్పుడు మీరు మీ సంతానానికి పెట్టే ఖర్చులు అప్పుడు అవసరం ఉండదు..ఓ వేళ అప్పుడూ  మీరే ఖర్చు చేయాల్సి వస్తే అది రిటైర్‌మెంట్ కింద పరిగణించరాదు. మీ నిర్ణయం ఎంత ఖచ్చితంగా ఉండాలంటే " 2030 నాటికి నేను రిటైర్ అవుతా, కానీ ఆదాయం మాత్రం ఇప్పటిలానే రూ.2లక్షలు రావాలి అని.." 
ద్రవ్యోల్బణం, అనారోగ్యం,ఇతర అవసరాలు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆర్ధిక విశ్లేషకులు మీకు ఓ ఊహామాత్రపు సలహాలు ఇవ్వగలరు. ప్రస్తుతం నెలకి రూ.2లక్షలు ఖర్చులు అయితే..అది 20 ఏళ్ల తర్వాత కనీసం రూ.6.41లక్షలకి చేరుతుంది. అంటే మీ రాబడి ఆ స్థాయిలో అప్పటికి రావాలి. మీ వయసు, మీ అవసరాలు అన్నీ తెలుసుకున్న తర్వాత పైనాన్షియల్ అడ్వైజర్లు మీకు ఎంత పొదుపు చేయాలనేది మాత్రమే చెప్పగలరు..ఆ స్థాయిలో పొదుపు చేయాలంటే ఆదాయం కూడా పెంచుకునే సామర్ధ్యం మీకు మీరు అలవరుచుకోవాలి. సాధారణంగా చేసే పొదుపు పథకాలు పిపిఎఫ్, ఈపిఎఫ్ మ్యూచువల్ ఫండ్లు మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో సాయపడతాయి. ఇక రిటైర్మెంట్ తర్వాత ఉపసంహరణలు కూడా వాయిదాల పద్దతిలోనే చేసుకుంటే పన్ను బెడద నుంచి కూడా తప్పించుకోవచ్చు. చివరిగా మార్క్ ట్వైయిన్ కొటేషన్‌తో ఈ కథనాన్ని ముగిద్దాం
                                                            "The secret of getting ahead is getting started"Most Popular