HAL ఇండియా ఐపీఓ వివరాలివీ..

HAL ఇండియా ఐపీఓ వివరాలివీ..

ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఎల్‌) ఐపీఓ ఈనెల 16న ప్రారంభం కాబోతోంది. ఈ నెల 20న ముగిసే ఇష్యూ ద్వారా ఈ మహారత్న కంపెనీ సుమారు రూ.4482 కోట్ల నిధులను సమీకరించనుంది. ఇష్యూ ధరల శ్రేణిని రూ.1215-1240గా కంపెనీ నిర్ణయించింది.  ఈ ఐపీవో ద్వారా హెచ్ఎఎల్ 10.20 శాతం వాటాకు సమానమైన 3,61,50,000 షేర్లను విక్రయించనుంది. ఈ ఇష్యూకి SBI క్యాపిటల్, యాక్సిస్ కాపిటల్  బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నారు. రిటైల్ వాటాదారులతో పాటు, కంపెనీ ఉద్యోగులకు ఆఫర్ ధరలో ఒక్కో షేరుపై రూ.25 డిస్కౌంట్ ఇస్తున్నారు.  కనీసం 12 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది

వ్యాపార వివరాలు..
1940లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కంపెనీ ప్రస్తుతం 27 రకాల  హెలికాప్టర్లను, తేలిక రకం యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. కంపెనీ అమ్మకాల్లో 91శాతానికి పైగా డిఫెన్స్ రంగం నుంచే వస్తున్నాయి. వైమానిక రంగంలో ప్రపంచంలోనే ఇది 39వ అతి పెద్ద కంపెనీ. ఐపీవో ద్వారా సేకరించిన నిధులతో నూతన డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ అనుగుణంగా మారడంతో పాటు ఇప్పటికే ఉన్న ఆర్డర్స్‌ను వేగంగా పూర్తి చేసేందుకు వియోగించనున్నారు. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు పెద్ద పీట వేస్తోన్న ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 11 R&D సెంటర్లు ఉన్నాయి. అలాగే బెంగళూరు కాంప్లెక్స్, ఎంఐజీ కాంప్లెక్స్, హెలికాప్టర్ కాంప్లెక్స్, యాక్సెసరీస్ కాంప్లెక్స్, డిజైన్ కాంప్లెక్స్ తో పాటు 11 ప్రొడక్షన్ డివిజన్లు కూడా ఉన్నాయి. 

క్లయింట్ల జాబితా ఇదీ..
దేశీయ కస్టమర్ల విషయానికి వస్తే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్గ్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ONGC, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక, గవర్నమెంట్ ఆఫ్ జార్ఖండ్, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, BHELలు ఉన్నాయి. 

ఫ్రాన్స్, USA, మారిషస్, ఇజ్రాయిల్, నమీబియా, నేపాల్, రష్యా, యూకే, ఒమన్, మలేషియా, థాయ్‌లాండ్, జర్మనీ, వియత్నాం దేశాలకు ఈ సంస్థ తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. 2002 నుంచి 2016 వరకు కంపెనీకి కేంద్ర ప్రభుత్వం "Excellent" రేటింగ్ ఇస్తోంది.

ఫైనాన్షియల్స్..
బలమైన ఆర్డర్ బుక్ ను కలిగి ఉన్న HAL... 2017 డిసెంబర్ 31 నాటికి రూ.19597 కోట్ల ఆదాయంపై రూ.2631 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. గత ఐదేళ్ళుగా కంపెనీ నిలకడైన వృద్ధిని నమోదు చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఆర్డర్ బుక్ రూ.68వేల కోట్లుగా ఉంది. వచ్చే మూడేళ్ళలో ఈ ఆర్డర్లను పూర్తి చేస్తామని, త్వరలోనే తమ ఆర్డర్ బుక్‌ను రూ.లక్ష కోట్లకు చేర్చే లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. కంపెనీకి సంబంధించిన గత ఐదేళ్ళ ఆదాయ వ్యయాలు, నికరలాభాన్ని దిగువ పట్టికలో చూద్దాం.


ముఖ్యాంశాలు..

- ఐపీఓ ప్రారంభం 16-3-2018, ముగింపు 20-3-2018
- ఐపీఓ సైజు : సుమారు రూ.4482 కోట్లు
- ఫేస్ వేల్యూ : ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.10
- ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ.1214-1240
- రిటైల్ ఇన్వెస్టర్లు, కంపెనీ ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.25 డిస్కౌంట్
- రిటైల్ పోర్షన్ వాటా 35శాతం
- జారీ చేసే షేర్లు : 3,41,07,525
- లాట్ సైజు : కనీసం 12 షేర్లకు దరఖాస్తు చేయాలి
- షేర్ల కేటాయింపు : 26 మార్చి 2018
- రీఫండ్  : 27 మార్చి 2018
- డీమ్యాట్ ఖాతాలో షేర్ల క్రెడిట్ :  : 27 మార్చి 2018
- లిస్టింగ్  : 28 మార్చి 2018 (BSE & NSEల్లో)Most Popular