విస్తరణ ప్రణాళికలతో రుషీల్ డెకార్ జంప్

విస్తరణ ప్రణాళికలతో రుషీల్ డెకార్ జంప్

రుషీల్ డెకార్ కంపెనీలో 43 శాతం అప్‌సైడ్‌కు అవకాశం ఉందంటూ రీసెర్చ్ సంస్థ ఇన్వెస్ట్‌మెంట్ ఇంపెరెటివ్ తెలియచేసింది. మరోవైపు ఎండీఎఫ్‌, డబ్ల్యూపీసీ విభాగాల్లో భారీగా విస్తరించబోతున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.

ఎక్స్‌పాన్షన్ ప్లాన్స్ కారణంగా ఈ కంపెనీకి 2020నాటికి రూ. 1277 టార్గెట్ ఇస్తున్నట్లు రీసెర్చ్ సంస్థ తెలియచేసింది. చెప్పిన సమయంలో ఏపీలో ఎండీఎప్ ప్రాజెక్ట్ ప్రారంభించడం, సామర్ధ్యంలో 80 శాతం వినియోగించుకోనుండడంతో.. బయ్ కాల్ ఇస్తున్నట్లు ఇన్వెస్ట్‌మెంట్ ఇంపెరెటివ్ వెల్లడించింది.

ఈ ప్రభావంతో ఇవాల్టి ట్రేడింగ్‌లో రుషీల్ డెకార్ షేర్ ధర భారీగా పెరిగింది. ఒక దశలో దాదాపు 10 శాతం లాభంతో రూ. 899.70ను తాకిన ఈ స్టాక్.. ట్రేడింగ్ ముగిసే సమయానికి 6.63 శాతం లాభంతో రూ. 880 వద్ద నిలిచింది.Most Popular