బైబ్యాక్‌తో అలెంబిక్‌ లిమిటెడ్‌ అప్‌!

బైబ్యాక్‌తో అలెంబిక్‌ లిమిటెడ్‌ అప్‌!

సొంత షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కు ఈ నెల 23 రికార్డ్‌ డేట్‌గా ప్రకటించడంతో దేశీ ఫార్మా సంస్థ అలెంబిక్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ బలపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 3.3 శాతం పెరిగి రూ. 63 సమీపంలో ట్రేడవుతోంది.
రూ. 82 కోట్లు
బైబ్యాక్‌లో భాగంగా షేరుకి రూ. 80 ధర మించకుండా 1.02 కోట్ల షేర్ల కొనుగోలుకి అలెంబిక్‌ లిమిటెడ్‌ బోర్డు ఇప్పటికే అనుమతించింది. ఇందుకు రూ. 82 కోట్లవరకూ వెచ్చించనుంది. Most Popular