బ్యాంక్ వడ్డీ రేట్ల కంటే ఈ షేర్లే ఎక్కువ డివిడెండ్ ఇస్తున్నాయ్..కొంటారా?

బ్యాంక్ వడ్డీ రేట్ల కంటే ఈ షేర్లే ఎక్కువ డివిడెండ్ ఇస్తున్నాయ్..కొంటారా?

స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ ప్రతికూలంగా ఉన్నా, కొన్ని స్టాక్స్ కొనుగోళ్లకి అనుకూలంగా ఉన్నట్లు కన్పిస్తుంటుంది. కొన్ని షేర్లు రేట్లలో భారీగా పెరుగుదల నమోదు కాకపోయినా..ఎక్కువమంది కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. దానికి అనేక కారణాలు చెప్పుకోవచ్చు.వాటిలో క్రమం తప్పకుండా డివిడెండ్లు చెల్లించడమనేది కూడా ఒకటి. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ ‌డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లకంటే ఎక్కువే వడ్డీ ఈ డివిడెండ్ రూపంలో వస్తున్నప్పుడు ఎవరైనా ఆయా కంపెనీల షేర్లు కొనుగోలు చేయకుండా ఎందుకు ఉంటారు. అలాంటి ఓ ఐదు కంపెనీలను ఇప్పుడు చూద్దాం
కోల్ ఇండియా : ప్రస్తుత ధర రూ.294.00, ఏడాదిలో మార్పు: 16.3శాతం
దేశంలోని మొత్తం బొగ్గు అవసరాల్లో 84శాతం కోల్ ఇండియా సంస్థ ఉత్పత్తులే తీర్చుతున్నాయ్. ప్రస్తుతానికి గ్రేడ్లు, రేటింగుల్లో మార్పులు తప్ప ప్రతికూల అఁశాలు లేవని మోతీలాల్ ఓస్వాల్ నమ్ముతోంది. ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల కాస్త ఆదాయంలో కోతకి కారణం అవ్వొచ్చేమో కానీ, దేశంలో విద్యుత్ ఉత్పత్తి రంగంలో కోల్ఇండియా పాత్ర ముఖ్యమైనది.  2020 ఆర్ధిక సంవత్సరంనాటికి 5.6రెట్లు ఎక్కువగా ట్రేడవుతూ కొనడానికి ఆకర్షణీయంగా ఉందని మోతీలాల్ ఓస్వాల్ చెప్తోంది. డివిడెండ్ చెల్లింపు 5-8శాతం వరకూ నమోదు చేసింది కోల్ ఇండియా

NMDC: ప్రస్తుతధర. 124.10, ఏడాదిలో మార్పు -9.8శాతం
డివిడెండు చెల్లింపులకు అవసరమైనంత నగదు సాధించడంలో ఎన్ఎండిసి సఫలీకృతమవుతూ వస్తోంది. గత ఆర్ధిక సంవత్సరంలో ఎన్ఎండిసి ఒక్కో షేరుకి రూ.5.20పైసలు డివిడెండు రూపంలో చెల్లించింది. ఇదే రకంగా రానున్న రెండేళ్లలో కూడా 4శాతం డివిడెండ్ అందిస్తున్నదని యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ సంస్థ అంచనా. ఇదే సంస్థ ఎన్ఎండిసీకి రూ.186 టార్గెట్ ధర సూచిస్తోంది

ONGC:  ప్రస్తుత ధర రూ.182.80, ఏడాదిలో మార్పు -7.4శాతం
చాలామంది అనలిస్టుల ఫేవరిట్ స్టాక్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్. బ్లూమ్ బర్గ్ డేటా ప్రకారం31 మంది అనలిస్టులు ( 83శాతం)  ఓఎన్జీసీని బయ్ రేటింగ్ ఔట్ లుక్‌తో ట్రాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఇది గత ఏడాదిలో అయితే కేవలం 18మంది అంటే 49శాతం మంది అనలిస్టులు మాత్రమే ఈ స్టాక్‌ని కొనమని సిఫార్సు చేశారు.ఈ ఆర్ధిక సంవత్సరంలో 45శాతం అంటే షేరుకి రూ.2.25 పైసల డివిడెండ్ ప్రకటించింది. చమురు ధరలు పెరగడం, సంస్థ ఉత్పత్తి సామర్ద్యం పెరగడం వంటి అంశాలు ఓఎన్జీసీని గట్టి స్టాక్‌గా నిలవడానికి కారణాలుగా చెప్తున్నారు. 

రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పోరేషన్: ప్రస్తుత ధర. రూ.130.25, ఏడాదిలో మార్పు -22.8%
బ్లూమ్ బర్గ్ డేటా ప్రకారం ఆర్ఈసీ కంపెనీ షేరుని ప్రతి 15మంది అనలిస్టులలో 9మంది కొనమని సిఫార్సు చేస్తున్నారు. డివిడెండ్ పరంగా ఈ ఆర్ధికసంవత్సరంలో 27.7శాతం పే అవుట్ ఇస్తోందని ఎడెల్వైజ్ సంస్థ చెప్తోంది. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో సంస్థాగతంగా చేసుకున్న మార్పులతో ఆర్ఈసీ 14-15శాతం వరకూ రిటన్ ఆన్ ఈక్విటీ ఇవ్వగలదని ఎడెల్వైజ్ అంచనా.

నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ NTPC: ప్రస్తుత ధర, రూ.169.55, ఏడాదిలో మార్పు -7.7శాతం
నమ్మకమైన వృధ్ది, బలమైన బ్యాలెన్స్ షీట్, సమృధ్దిగా ఉన్న నగదు నిల్వ ఇవన్నీ కలిసి ఎన్‌టిపిసిని కొనుగోలుకి అర్హమైన స్టాక్‌గా నిలబెడుతున్నాయని రిలయన్స్ సెక్యూరిటీస్ ఓ రిపోర్ట్ ప్రకటించింది.  ఈ స్టాక్‌కి రూ.192 నుంచి రూ.213 వరకూ పెరగగల సామర్ద్యం ఉందని కూడా రిలయన్స్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. ఎన్‌టిపిసి గత ఏడాది 2.88శాతం డివిడెండ్ ప్రకటించింది

కింది పట్టికలో గత ఐదేళ్లలో ఈ ఐదు సంస్థలు ఎలాంటి పేఔట్స్ ఇచ్చాయో గమనించవచ్చుMost Popular