మళ్లీ గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ షేర్ల ర్యాలీ!

మళ్లీ గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ షేర్ల ర్యాలీ!

వరుసగా రెండో రోజు గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ తయారీ కంపెనీల కౌంటర్లకు భారీ డిమాండ్‌ కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో సరఫరా కొరత కొనసాగడంతోపాటు డిమాండ్‌ మరింత పుంజుకోనున్నట్లు వెలువడుతున్న అంచనాలు ఈ రంగంలోని కంపెనీలకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం బీఎస్ఈలో గ్రాఫైట్‌ ఇండియా 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 709 వద్ద ఫ్రీజయ్యింది. సోమవారం సైతం ఈ కౌంటర్‌ 5 శాతం పెరిగి లాక్‌కావడం విశేషం! ఇక ముందురోజు 4.5 శాతం ఎగసిన హెచ్‌ఈజీ ప్రస్తుతం దాదాపు 7 శాతం జంప్‌చేసి రూ. 2862 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2876 వరకూ ఎగసింది. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');