ఎన్‌బీసీసీకి సీఎండీ రిలీఫ్‌- షేరు జూమ్‌!

ఎన్‌బీసీసీకి సీఎండీ రిలీఫ్‌- షేరు జూమ్‌!

గతంలో కంపెనీ సీఎండీకి వ్యతిరేకంగా కేసు నమోదుచేసిన సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేయడంలో విఫలమైనట్లు వెల్లడికావడంతో ప్రభుత్వ రంగ మౌలిక సదుపాయాల సంస్థ ఎన్‌బీసీసీ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 194ను అధిగమించింది. తొలుత రూ. 196ను తాకింది. 
ప్రగతి మైదాన్‌ ఐటీపీవో కాంప్లెక్స్‌ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించి  సీఎండీ అనూప్‌ కుమార్‌ మిట్టల్‌పై చేసిన అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తులో తగిన ఆధారాలు లభించలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.Most Popular