4 వారాల్లో 17 శాతం రాబడులు ఇచ్చే టాప్ టెక్నికల్ పిక్స్

4 వారాల్లో 17 శాతం రాబడులు ఇచ్చే టాప్ టెక్నికల్ పిక్స్

10155 పాయింట్ల వద్ద ఉన్న 200 రోజుల మూవింగ్ యావరేజ్‌ను టెస్ట్ చేసిన తర్వాత.. నిఫ్టీ ఫ్యూచర్స్‌ ఇండెక్స్‌లో పుల్‌బ్యాక్ ర్యాలీ వచ్చింది. తాజా కరెక్షన్(10640-10155)కు 61.8 శాతం ఫిబొనాకి రీట్రేస్‌మెంట్ లెవెల్.. 10455 వద్ద ఉంది. ఈ లెవెల్‌ను అధిగమిస్తే 10640- 10770 వరకు నిఫ్టీ ర్యాలీ చేసే అవకాశం ఉంది. 
తక్షణ నిరోధం అయిన 10455 పాయింట్లను అధిగమించడంలో విఫలం అయితే మాత్రం 10155-10095 వద్ద నిఫ్టీకి మద్దతు లభించనుంది. 
తాజా పుల్‌బ్యాక్ ర్యాలీలో ఆర్ఎస్ఐ 50 లెవెల్‌కు పడిపోయింది. 50ను అధిగమిస్తే మాత్రం ఈ ర్యాలీ మరింతగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
అనేక స్టాక్ ఛార్టులలో పాజిటివ్ డైవర్జెన్స్‌లు కనిపిస్తుండడంతో, కొన్ని కరెక్షన్‌లు వచ్చినా పుల్‌బ్యాక్‌లు కొనసాగే అవకాశం ఉంది. ఈ సమయంలో రాబోయే 3-4 వారాలకు 17 శాతం వరకూ రాబడులు అందించే స్టాక్స్‌ గురించి తెలుసుకుంది.

 

అమర రాజా బ్యాటరీస్: BUY|

టార్గెట్ రూ. 915| స్టాప్‌లాస్ రూ. 765| రాబడులకు అవకాశం 13%
రూ. 818 వద్ద ఉన్న ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ లైన్‌ను బ్రేకవుట్ చేసేందుకు అమరరాజా బ్యాటరీస్ సిద్ధంగా ఉందని.. వీక్లీ ఛార్టులు చూస్తే అర్ధమవుతుంది. నెక్‌లైన్‌కు ఎగువన మంచి వాల్యూమ్స్‌తో ట్రేడవుతుండడంతో.. రాబోయే సెషన్స్‌లో ఈ స్టాక్ మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

బజాజ్ ఆటో: BUY|

టార్గెట్ రూ. 3300| స్టాప్‌లాస్ రూ. 2840| రాబడులకు అవకాశం 12%
వీక్లీ ఛార్టులలో ఛానల్ లోయర్ ఎండ్‌ను టెస్ట్ చేసిన తర్వాత.. బజాజ్ పైకి కదలడం ప్రారంభించింది. రూ. 3000 స్థాయికి ఎగువన నిలబడి.. మంచి వాల్యూమ్స్‌ను నమోదు చేస్తే, ఈ అప్‌మూవ్ మరోసారి కొనసాగే అవకాశం ఉంది. బుల్లిష్ హార్మోనిక్ ప్యాటర్న్‌ను గమనిస్తే.. రాబోయే సెషన్స్‌లో బుల్లిష్ ట్రెండ్ చూపించవచ్చు.

 

పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్: BUY|

టార్గెట్ రూ. 187| స్టాప్‌లాస్ రూ. 147| రాబడులకు అవకాశం 17%
వీక్లీ ఛార్టులలో పీఎన్‌సీ ఇన్‌ఫ్రా టెక్ బుల్లిష్ హార్మోనిక్ ప్యాటర్న్‌ను ఫామ్ చేసింది. రూ. 145 వద్ద పీఆర్‌జెడ్ ఉండగా.. ఈ లెవెల్ ఎగువన ట్రేడింగ్ నిలబడితే, అప్‌ట్రెండ్‌కు సూచికగా చెప్పవచ్చు. డైలీ ఛార్టుల ప్రకారం రూ. 162 వద్ద ఉన్న రెసిస్టెన్స్ బ్రేక్ చేసేందుకు ఈ స్టాక్ సిద్ధంగా ఉంది. Most Popular