గణాంకాలతో గోవా కార్బన్‌ అప్‌!

గణాంకాలతో గోవా కార్బన్‌ అప్‌!

ఫిబ్రవరి నెలకు కాల్సైన్డ్‌ పెట్రోలియం కోక్‌ ఉత్పత్తి 1172 కోట్ల టన్నులను తాకినట్లు వెల్లడించడంతో గోవా కార్బన్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 3.1 శాతం ఎగసి రూ. 954 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 969 వరకూ జంప్‌చేసింది. మొత్తం ఉత్పత్తిలో బిలాస్‌పూర్‌ ప్లాంటు నుంచి 266.5 కోట్ల టన్నులు, పారదీప్‌ ప్లాంటునుంచి 848.4 కోట్ల టన్నులు, గోవా ప్లాంటు నుంచి 57.28 కోట్ల టన్నుల ఉత్పత్తి జరిగినట్లు వివరించింది.
అమ్మకాలు ఇలా
ఫిబ్రవరి నెలలో కాల్సైన్డ్‌ పెట్రో కోక్‌ అమ్మకాలు 1444.7 కోట్ల టన్నులకు చేరినట్లు గోవా కార్బన్‌ తెలియజేసింది. వీటిలో బిలాస్‌పూర్‌ ప్లాంటు నుంచి 328.57 కోట్ల టన్నులు, పారదీప్‌ నుంచి 614.12 కోట్ల టన్నులు, గోవా ప్లాంటు నుంచి 502 కోట్ల  టన్నుల విక్రయాలు నిర్వహించినట్లు తెలియజేసింది.Most Popular