ఉన్నట్టుండి అమ్మకాలు- మార్కెట్లు నష్టాల్లో!

ఉన్నట్టుండి అమ్మకాలు- మార్కెట్లు నష్టాల్లో!

ఉన్నట్టుండి ఊపందుకున్న అమ్మకాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు కంగుతిన్నాయి.  తొలి నుంచీ చెప్పుకోదగ్గ లాభాలతో పటిష్టంగా కదిలిన మార్కెట్లలో మిడ్‌ సెషన్‌ నుంచీ అమ్మకాలు పెరగడంతో ఒక్కసారిగా నష్టాలలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 127 పాయింట్లు క్షీణించి 33,790ను తాకింది. తద్వారా తిరిగి 34,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరగా... నిఫ్టీ 33 పాయింట్లు తగ్గి 10,388 వద్ద ట్రేడవుతోంది.
ఐటీ దెబ్బ
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ రంగం దాదాపు 2 శాతం పతనంకాగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌ 2.2 శాతం ఎగసింది. రియల్టీ 1.3 శాతం, ఫార్మా 0.8 శాతం చొప్పున బలపడ్డాయి. బ్లూచిప్స్‌లో టీసీఎస్‌ 5.5 శాతం తిరోగమించగా.. హెచ్‌సీఎల్‌ టెక్, కొటక్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, మారుతీ, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్‌, ఎల్‌అండ్‌టీ, సిప్లా, అంబుజా 2-0.7 శాతం మధ్య నీరసించాయి. అయితే మరోపక్క హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, యాక్సిస్‌, ఐవోసీ, ఐబీ హౌసింగ్‌, విప్రో, సన్ ఫార్మా, ఐషర్‌, గెయిల్‌ 4-1.2 శాతం మధ్య ఎగశాయి.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');