ప్రభుత్వ బ్యాంకుల హవా-ఐటీ డీలా!

ప్రభుత్వ బ్యాంకుల హవా-ఐటీ డీలా!

వరుసగా మూడు రోజులపాటు ర్యాలీ చేసిన ఐటీ కౌంటర్లలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతుంటే.. మరోవైపు ఇటీవల పతనబాటలో సాగిన ప్రభుత్వ రంగ బ్యాంక్‌ కౌంటర్లలో స్క్వేరప్‌ లావాదేవీలను చేపడుతున్నారు. దీంతో ఎన్‌ఎస్ఈలో ఐటీ రంగం 1.25 శాతం వెనకడుగు వేయగా.. పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఏకంగా 4.2 శాతం జంప్‌ చేసింది. ఈ బాటలో రియల్టీ సైతం దాదాపు 2 శాతం ఎగసింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 34,004కు చేరగా.. నిఫ్టీ 40 పాయింట్లు ఎగసి 10,461 వద్ద ట్రేడవుతోంది.
అన్నీ బ్యాంకులే
ఎఫ్‌అండ్‌వో విభాగంలో బ్యాంకింగ్‌ కౌంటర్ల హవా కనిపిస్తోంది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంక్‌, ఓబీసీ, బీవోబీ, అలహాబాద్‌, సిండికేట్‌, కెనరా, ఆంధ్రా బ్యాంక్‌, పీఎన్‌బీ, ఇండియన్‌ బ్యాంక్‌ 12-6 శాతం మధ్య జంప్‌చేశాయంటే కొనుగోళ్ల వెల్లువను అర్ధం చేసుకోవచ్చు. అయితే మరోవైపు టీసీఎస్ 5 శాతం పతనంకాగా.. ఎన్‌టీపీసీ, పేజ్‌, కోల్‌ ఇండియా, మైండ్‌ట్రీ, మహానగర్‌ గ్యాస్‌, ఎంఅండ్‌ఎం, మారుతీ, హెచ్‌సీఎల్‌ టెక్, ఐసీఐసీఐ ప్రు 1-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. కాగా.. రియల్టీ కౌంటర్లలో హెచ్‌డీఐఎల్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఒబెరాయ్‌, ఇండియాబుల్స్‌, డీఎల్‌ఎఫ్‌ 5-2 శాతం మధ్య బలపడ్డాయి.Most Popular