కొత్త ప్రింటింగ్‌ మెషీన్‌- యూఫ్లెక్స్‌ అప్‌!

కొత్త ప్రింటింగ్‌ మెషీన్‌- యూఫ్లెక్స్‌ అప్‌!

సొంత టెక్నాలజీతో దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రింటింగ్‌ మెషీన్‌ ఆవిష్కరించడంతో యూఫ్లెక్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ లాభాల రంగులు వెదజల్లుతోంది. ఇన్వెస్టర్లు దృష్టిసారించడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 4.3 శాతం జంప్‌చేసి రూ. 346 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 350 వరకూ ఎగసింది.
గేర్‌లెస్‌ మెషీన్‌
గేర్లులేని సీఐ ఫ్లెక్సో ప్రింటింగ్‌ మెషీన్‌ను యూఫ్లెక్స్‌ లిమిటెడ్‌ ఆవిష్కరించింది. సొంతంగా అభివృద్ధి చేసిన ఈ మెషీన్‌ 1350 ఎంఎం వెడల్పు వెబ్‌ను హ్యాండిల్‌ చేయగలదని, నిమిషానికి 400 మీటర్ల మెటీరియల్స్‌ను ప్రింట్ చేయగలదని యూఫ్లెక్స్‌ పేర్కొంది. ఎల్‌డీపీఈ, పాలీప్రొపిలీన్‌, పెట్‌ తదితరాల ప్రింటింగ్‌ అవసరాలను తీర్చగలదని తెలియజేసింది.Most Popular