ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్- ఛార్జీల తగ్గింపు!

ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్- ఛార్జీల తగ్గింపు!

పొదుపు ఖాతాలలో కనీస నిల్వ(మినిమమ్‌ బ్యాలన్స్‌)ను నిర్వహించని కస్టమర్లపై ప్రస్తుతం విధిస్తున్న చార్జీలను తగ్గిస్తున్నట్లు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) తాజాగా ప్రకటించింది. మెట్రో నగరాలు, పెద్ద నగరాలలోని ఖాతాదారులపై ప్రస్తుతం గరిష్టంగా రూ. 50 చార్జీ విధిస్తుండగా... దీనిని రూ. 15కు తగ్గిస్తున్నట్లు స్టేట్‌బ్యాంక్‌ తెలియజేసింది. ఇదే విధంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంత బ్యాంకు ఖాతాదారులపై విధిస్తున్న చార్జీలను సైతం కుదిస్తున్నట్లు వివరించింది. అయితే చార్జీలకు జీఎస్‌టీ అదనమని తెలియజేసింది. 
తగ్గింపు ఇలా..
పట్టణాలు, గ్రామీణ ప్రాంత కస్టమర్లపై కనీస నిల్వ నిబంధనను పాటించకపోతే.. ప్రస్తుతం రూ. 40 వరకూ చార్జీ విధిస్తుండగా.. ఇకపై ఇది రూ. 12కు దిగిరానుంది. దీంతో దేశవ్యాప్తంగా 25 కోట్లమంది స్టేట్‌బ్యాంక్‌ ఖాతాదారులకు లబ్ది చేకూరనున్నట్లు తెలియజేసింది. మెట్రోలలో కనీస నిల్వకంటే 50-75 శాతం తక్కువకు చేరిన ఖాతాలపై ప్రస్తుతం రూ. 50-40-30 స్థాయిలో చార్జీ వసూలు చేస్తున్న ఎస్‌బీఐ ఇకపై వీటిని రూ. 10-12-15 చొప్పున కుదించనుంది. గ్రామీణ ప్రాంతాలలో అయితే ప్రస్తుతం రూ. 40-30-20 స్థాయిలో వసూలు చేస్తున్న చార్జీలను రూ. 10-7.5-5కు తగ్గించనుంది.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');