వేదాంత.. 2120 శాతం మధ్యంతర డివిడెండ్ !

వేదాంత.. 2120 శాతం మధ్యంతర డివిడెండ్ !

2017-18 ఆర్థిక సంవత్సరానికి తొలి మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది వేదాంత. రూ. 1 ఫేస్ వాల్యూ కలిగిన ఒక్కో షేరుకు 2120 శాతం చొప్పున.. అంటే రూ.21.20 డివిడెండ్‌ను అందించబోతున్నట్లు.. ఎక్స్‌ఛేంజ్‌లకు వేదాంత సమాచారం ఇచ్చింది. 

ఇవాళ జరిగిన బోర్డ్ మీటింగ్‌లో మధ్యంతర డివిడెండ్‌పై చర్చించి.. కంపెనీ డైరెక్టర్లు తుది నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈలకు సమాచారం ఇచ్చారు. 

భారీ డివిడెండ్ ప్రభావంతో వేదాంత షేర్‌కు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేర్ ధర 1.67 శాతం లాభంతో రూ. 322.70 వద్ద ట్రేడవుతోంది.Most Popular