ఫ్యూచర్‌ కన్జూమర్‌కు రేటింగ్‌ కిక్‌!

ఫ్యూచర్‌ కన్జూమర్‌కు రేటింగ్‌ కిక్‌!

బ్రోకింగ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ షేరు కొనుగోలుకి సిఫారసు చేయడంతో ఫ్యూచర్‌ కన్జూమర్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 13.3 శాతం జంప్‌చేసింది. రూ. 57 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 58 వరకూ పెరిగింది.
రూ. 76 టార్గెట్‌
ఇకపై ఫ్యూచర్‌ కన్జూమర్‌ మరింత మెరుగైన పనితీరును కనబరిచే వీలున్నదని భావిస్తున్నట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ పేర్కొంది. దీంతో రూ. 76 టార్గెట్‌ ధరతో ఈ షేరు కొనుగోలుకి సిఫారసు చేస్తున్నట్లు తెలియజేసింది. వెరసి 40 శాతంపైగా లాభాలకు చాన్స్‌ ఉన్నట్లు భావిస్తోంది.Most Popular