మిశ్రమంగా ఆసియా మార్కెట్లు!

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు!

శుక్రవారం భారీగా ఎగసిన అమెరికా స్టాక్ మార్కెట్లు సోమవారం తిరిగి డీలాపడటంతో ఆసియా స్టాక్‌ మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో తైవాన్‌ 0.7 శాతం పుంజుకోగా.. జపాన్‌ 0.35 శాతం బలపడింది. ఈ బాటలో సింగపూర్‌ 0.2 శాతం, కొరియా 0.1 శాతం పుంజుకోగా.. ఇండొనేసియా 0.8 శాతం తిరోగమించింది. మిగిలిన మార్కెట్లలో చైనా, హాంకాంగ్‌ 0.2 శాతం చొప్పున నీరసించగా.. థాయ్‌లాండ్ నామమాత్ర నష్టంతో కదులుతోంది. 
డాలరు యథాతథం
ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు యథాతథంగా 89.9కు చేరగా.. యూరో 0.25 శాతం బలపడి 1.23 వద్ద ట్రేడవుతోంది. ఇక జపనీస్‌ యెన్‌ 0.15 శాతం నీరసించి 106.28ను తాకింది. కాగా.. యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ 2.87 శాతాన్ని తాకాయి.Most Popular