పెట్టుబడులతో శంకర బిల్డింగ్‌ ఖుషీ!

పెట్టుబడులతో శంకర బిల్డింగ్‌ ఖుషీ!

ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా కంపెనీలో అమన్సా హోల్డింగ్స్‌ ఇన్వెస్ట్‌ చేసినట్లు వెల్లడించడంతో శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌ కౌంటర్‌ బలపడింది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 2.35 శాతం పెరిగి రూ. 1791 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1800 వరకూ జంప్‌చేసింది.
బల్క్‌డీల్స్‌ ద్వారా
బీఎస్‌ఈలో బల్క్‌డీల్‌ ద్వారా 1.47 లక్షల షేర్లను  అమన్సా హోల్డింగ్స్‌ కొనుగోలు చేసినట్లు శంకర బిల్డింగ్‌ పేర్కొంది. ఇదే విధంగా ఎన్‌ఎస్ఈ ద్వారా సైతం 2.15 లక్షల షేర్లను సొంతం చేసుకున్నట్లు తెలియజేసింది. వీటిని రూ. 1755 సగటు ధరలో కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.Most Popular