భారత్‌ డైనమిక్స్‌ ఐపీవో షురూ!

భారత్‌ డైనమిక్స్‌ ఐపీవో షురూ!

ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ పబ్లిక్‌ ఇష్యూ నేటి(13) నుంచి ప్రారంభమైంది. గురువారం(15న) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 413-428కాగా.. తద్వారా కంపెనీ రూ. 961 కోట్లను సమీకరించనుంది. విభిన్న మిసైల్స్‌తోపాటు రక్షణ రంగానికి అవసరమయ్యే పలు పరికరాల తయారీలో పేరొందిన భారత్‌ డైనమిక్స్‌లో 12 శాతం వాటా(2.21 కోట్ల షేర్ల)ను కేంద్ర ప్రభుత్వం విక్రయానికి ఉంచింది. 
రిటైలర్లకు డిస్కౌంట్‌
ఇష్యూ ధరలో కంపెనీ ఉద్యోగులు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు ప్రభుత్వం రూ. 10 ధరను డిస్కౌంట్‌ ఇస్తోంది. రిటైలర్లు రూ. 2 లక్షల పెట్టుబడికి మించకుండా ఇష్యూకి దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 35 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. 

For More details about this Issue, click this link

https://www.profityourtrade.in/view-news-14845-bharat-dynamics-ipoMost Popular