నెగటివ్ ట్రెండ్‌లోనూ లాభాలు పంచిన షేర్లివి..! ఇంకా పెరుగుతాయట

నెగటివ్ ట్రెండ్‌లోనూ లాభాలు పంచిన షేర్లివి..! ఇంకా పెరుగుతాయట


మార్కెట్ల తీరుతో సంబంధం లేకుండా సుస్థిరంగా ఆదాయం సాధించే సంస్థలకు ఈక్విటీ మార్కెట్లలో మంచి ఆదరణే దక్కుతుంటుంది. ఇది గత నాలుగేళ్లలో కొన్ని షేర్ల పెరుగుదలను గమనిస్తే అర్ధం అవుతుంది కూడా! ఈ కాలంలో నిఫ్టీ ఆదాయం 7 శాతం పెరుగుదల నమోదు కాగా అంచనా అయితే 12శాతంగా లెక్కగట్టారు. అంటే  ఐదుశాతం అంచనాల్లో తగ్గుదల చోటు చేసుకుంది. కానీ ఇదే కాలంలో కొన్ని  మధ్యతరహా, చిన్నతరహా మార్కెట్ కేపిటలైజేషన్ కలిగిన కంపెనీలు మాత్రం 20శాతం వరకూ ఆదాయం సంపాదించుకోవడం గమనార్హం. వాటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్, టిన్‌ప్లేట్ కంపెనీ, మోతీలాల్ ఓస్వాల్ పైనాన్షియల్ సర్వీసెస్, ఫిలిప్ కార్బన్ బ్లాక్, కేపిటల్ ఫస్ట్, కేప్లిన్ పాయింట్ లేబరేటరీస్, జెఎం ఫైనాన్షియల్  కూడా ఉన్నాయ్. ఐతే వీటిలో కొన్ని స్టాక్స్ ఇప్పుడు వాటి 52 వారాల గరిష్ట ధర నుంచి 25-30శాతం వరకూ తగ్గి ట్రేడవుతున్నాయ్. 
ప్రస్తుతం మార్కెట్లలో నడుస్తోన్న క్లిష్టదశలో కూడా ఈ కంపెనీలు మంచి పనితీరు ప్రదర్శించడం గమనించాలి. ఇక పరిస్థితిలో మార్పు గనుక వస్తే..ఈ కంపెనీల ఆదాయం రాబడి మరింత పెరగడం ఖాయమని విశ్లేషకులు చెప్తున్నారు. కింద పట్టిక చూస్తే..కంపెనీల స్టాక్ రేట్లు..వాటి ఆదాయం గమనించవచ్చుMost Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');