34,000కు సెన్సెక్స్‌- పీఎస్‌యూ బ్యాంక్స్‌ హవా!

34,000కు సెన్సెక్స్‌- పీఎస్‌యూ బ్యాంక్స్‌ హవా!

స్వల్ప ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకు కౌంటర్ల అండతో సెన్సెక్స్‌ లాభాల సెంచరీ సాధించింది. వెరసి 34,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ 10,500 మార్క్‌వైపు కదులుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 147 పాయింట్లు పెరిగి 34,065కు చేరగా.. నిఫ్టీ 51 పాయింట్లు ఎగసి 10,473 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టీలో బీవోబీ, పీఎన్‌బీ, కెనరా, యాక్సిస్‌, ఎస్‌బీఐ, ఫెడరల్‌, ఐసీఐసీఐ 6-1.5 శాతం మధ్య జంప్ చేశాయి.
ఐటీ వెనకడుగు
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌ 3.5 శాతం జంప్‌చేయగా.. ప్రయివేట్‌ బ్యాంక్స్‌ సైతం 1.2 శాతం ఎగసింది. ఐటీ దాదాపు 1 శాతం నీరసించింది. బ్లూచిప్స్‌లో హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, విప్రో, ఇన్‌ఫ్రాటెల్‌, ఐబీ హౌసింగ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఆటో 4-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే టీసీఎస్ 5 శాతం పతనమైంది. ఇతర దిగ్గజాలలో కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, హిందాల్కో, జీ, ఎంఅండ్‌ఎం 2-0.4 శాతం మధ్య డీలాపడ్డాయి.Most Popular