బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రికవరీ బూస్ట్‌!

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రికవరీ బూస్ట్‌!

స్టాండ్‌బై లెటర్స్‌ ఆఫ్‌ క్రెడిట్(ఎస్‌ఎల్‌వోసీలు) ద్వారా ఇతర బ్యాంకుల నుంచి రూ. 7,000 కోట్ల విలువైన రుణ రికవరీ జరిగినట్లు వెల్లడించడంతో ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 10.5 శాతం దూసుకెళ్లి రూ. 105 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 106 వరకూ ఎగసింది.
రూ. 2,000 కోట్లు
మరో రెండు నెలల్లోగా రూ. 2,000 కోట్లమేర రుణాలు రికవరీకానున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. దీంతో బ్యాంక్ బ్యాలన్స్‌షీట్‌ మెరుగుపడే వీలున్నట్లు తెలియజేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ దిద్దుబాటు చర్యలు(పీసీఏ) చేపట్టమంటూ ఆదేశించడంతో బ్యాంకు మొండిబకాయిలను తగ్గించుకునే ప్రణాళికలు అమలు చేస్తోంది.Most Popular