ఎలాంటి టైంలో అయినా ఈ ఫండ్‌దే బెస్ట్ పెర్ఫామెన్స్!

ఎలాంటి టైంలో అయినా ఈ ఫండ్‌దే బెస్ట్ పెర్ఫామెన్స్!

రిలయన్స్ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్.. 2005 జూన్‌లో లాంఛ్ అయింది. క్రిసిల్ మ్యూచువల్ ఫండ్ రేటింగ్ ప్రకారం బ్యాలెన్స్‌డ్ ఫండ్ కేటగిరీలో ఈ ఫండ్‌ను చేర్చారు. డిసెంబర్ 2017తో ముగిసిన కాలానికి వరుసగా మూడు త్రైమాసికాల పాటు.. టాప్30 పర్సెంటైల్(క్రిసిల్ ఫండ్ ర్యాంక్ 1 లేదా 2)ను ఈ ఫండ్ సొంతం చేసుకుంది. నిలకడగా రాబడులను అందించడం ఈ ఫండ్ ప్రధాన ఉద్దేశ్యం. ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాలు, ఫిక్సెడ్ ఇన్‌కం సాధనాలలో పెట్టుబడులు చేయడం ద్వారా ఇన్వెస్టింగ్‌ మిక్స్‌ను ఈ ఫండ్ కలిగి ఉంది. 

 

బెంచ్‌మార్క్‌ను ఔట్ పెర్ఫామ్ 
ఈ ఫండ్ బెంచ్ మార్క్(క్రిసిల్ హైబ్రిడ్ 35+65 - అగ్రెసివ్ ఇండెక్స్) ఇండెక్స్‌ను.. ఇత పీర్స్‌ను ఔట్‌పెర్ఫామ్ చేస్తూనే ఉంది. పలు బుల్, బేర్ ఫేజ్‌లను రిలయన్స్ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్ ఎదుర్కొంది. దాదాపు అన్ని సమయాల్లోను బెంచ్‌మార్క్‌లను ఔట్ పెర్ఫామ్ చేయడం విసేషం. జూన్ 8, 2005న ఈ ఫండ్‌లో రూ. 1000 పెట్టుబడి చేస్తే.. ఇప్పుడు రూ. 5467కు మీ పెట్టుబడి చేరేది(14.27 వార్షిక క్రమానుగత వృద్ధిరేటు). ఇదే సమయంలో బెంచ్ మార్క్ ఇండెక్స్ 12.75 శాతం రిటర్న్స్ మాత్రమే ఇచ్చింది.

 

సిప్ ద్వారా అయినా

ఇదే సమయంలో ఈ ఫండ్‌లో ఎస్ఐపీ ద్వారా రూ. 1000 పెట్టుబడి చేసినట్లు అయితే 15.99 వార్షిక రాబడులను అందించడం విశేషం. సిప్ విధానం ద్వారా బెంచ్ మార్క్ ఇండెక్స్‌లో పెట్టుబడి చేస్తే 12.09 రాబడులను అందించింది. గత మూడేళ్లుగా రిలయన్స్ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్‌ సగటున 69.5 శాతం ఈక్విటీలలో కేటాయింపులు జరపగా.. 26.4 శాతం ఫిక్సెడ్ ఇన్‌కం సాధనాలలోను.. మిగిలిన మొత్తాన్ని క్యాష్ లేదా సమాన రూపాల్లో ఉన్నాయి. ఈక్విటీ కేటాయింపులలో లార్జ్‌క్యాప్స్ వాటా 75 శాతం కావడం విశేషం. టాప్ 5 సెక్టార్లకు 40.81 శాతం వాటా ఉంది. ఇందులో బ్యాంకులు 18.21 శాతం, ఆటోమొబైల్ 7.24 శాతం, సాఫ్ట్‌వేర్ 5.58 శాతం, పెట్రోలియం ప్రొడక్ట్స్ 5.32 శాతం, ఫార్మాస్యూటికల్స్ 4.45 శాతం చొప్పున కేటాయింపులు ఉన్నాయి. 

 

సపోర్ట్ చేసిన స్టాక్స్

బ్యాంకులు, ఆటోమొబైల్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్‌తో పాటు సిమెంట్, ఆటో యాన్సిలరీస్ కంపెనీలు ఫండ్ పెర్ఫామెన్స్‌లో కీలక పాత్ర పోషించాయి. బ్యాంకులలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ భారీ రిటర్న్స్ ఇచ్చాయి. ఆటో యాన్సిలరీ స్టాక్స్‌లలో మదర్సన్ సుమి సిస్టమ్స్, సుందరం క్లేటన్ కీలకంగా ఉన్నాయి. మారుతి సుజుకి, రిలయన్స్ ఇండస్ట్రీస్, గ్రాసిం ఇండస్ట్రీస్, ఇండియన్ ఆయిల్ కూడా భారీ రాబడులను అందించాయి. 

మొత్తం పోర్ట్‌ఫోలియోలో 47 స్టాక్స్ ఉండగా.. గత మూడేళ్లలో 109 స్టాక్స్‌లో ఎక్స్‌పోజర్‌ను తీసుకున్నారు. 13 స్టాక్స్‌ను నిలకడగా కొనసాగించగా(సగటున 36 శాతం), వీటిలో 8 నిఫ్టీని ఔట్‌పెర్ఫామ్ చేశాయి. ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో స్టాక్స్ సంఖ్య క్రమంగా పెరుగుదల చూపింది. 2015లో 40 స్టాక్స్ ఉండగా.. 2017 చివరకు ఈ సంఖ్య 60కు చేరుకుంది. 

పోర్ట్‌ఫోలియోలోని ఫిక్సెడ్ ఇన్‌కం పోర్షన్‌ను ఎక్కువగా హై రేటెడ్ కార్పొరేట్ సెక్యూరిటీస్(ఏఏఏ/ఏ1+)కు కేటాయించారు. 18.9 శాతం వాటా వీటిలో పెట్టుబడులు చేయగా.. మిగిలిన మొత్తాన్ని ఏఏఏ/ఏ1+కు దిగువన ఉన్న సాధనాల్లో గత మూడేళ్లలో ఇన్వెస్ట్ చేయడం కనిపించింది. 
 Most Popular