అటూఇటుగా - ఐటీ వీక్‌- బ్యాంక్స్‌ అప్‌!

అటూఇటుగా - ఐటీ వీక్‌- బ్యాంక్స్‌ అప్‌!

ముందురోజు భారీ లాభాలతో హైజంప్‌ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులతో ప్రారంభమయ్యాయి. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 24 పాయింట్ల లాభంతో 33,942కు చేరగా.. నిఫ్టీ 7 పాయింట్లు పుంజుకుని 10,429 వద్ద ట్రేడవుతోంది. సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు నష్టపోవడం.. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదులుతుండటం వంటి అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
ప్రభుత్వ బ్యాంకుల జోరు
సోమవారం పతన బాటలో సాగిన ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో 2.4 శాతం జంప్‌చేయగా.. ఐటీ, మెటల్‌ రంగాలు దాదాపు 1 శాతం నష్టపోయాయి. నిఫ్టీ దిగ్గజాలలో విప్రో, ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఇన్ఫ్రాటెల్‌, ఎస్‌బీఐ, భారతీ, సన్‌ ఫార్మా, ఐసీఐసీఐ 2.4-1 శాతం మధ్య లాభపడగా.. టాటా సన్స్‌ వాటా విక్రయంతో టీసీఎస్  5 శాతంపైగా పతనమైంది. ఇతర దిగ్గజాలలో ఎన్‌టీపీసీ, హిందాల్కో, వేదాంతా, కోల్‌ ఇండియా, జీ, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, సిప్లా 2-0.7 శాతం మధ్య తిరోగమించాయి.Most Popular