ఆ ఆదేశాలతో ఇండిగో నేలచూపులు!

ఆ ఆదేశాలతో ఇండిగో నేలచూపులు!

ఇండిగో బ్రాండుతో నిర్వహిస్తున్న 8 విమానాలను నిలిపివేయాల్సిందిగా పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌(డీజీసీఏ) ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ను ఆదేశించినట్లు వార్తలు వెలువడటంతో ఈ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇంటర్‌గ్లోబ్‌ షేరు 2.6 శాతం క్షీణించి రూ. 1244 దిగువన ట్రేడవుతోంది. 
గో ఎయిర్‌ కూడా
ఇండిగోతోపాటు గో ఎయిర్‌ బ్రాండుతో నిర్వహిస్తున్న మరో 3 విమానాలను సైతం నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ 11 విమానాలూ.. ఎయిర్‌బస్‌కు చెందిన ఏ 320 నియో మోడళ్లుకాగా... వీటి ఇంజిన్లలో సమస్యలున్న కారణంగా సర్వీసులను వెంటనే నిలుపుదల చేయాల్సిందిగా డీజీసీఏ ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. Most Popular