అమెరికా మార్కెట్లకు దిగ్గజాల దెబ్బ!

అమెరికా మార్కెట్లకు దిగ్గజాల దెబ్బ!

ఇటీవల మెటల్స్‌పై దిగుమతి సుంకాలను ప్రకటించిన ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఇందుకు చట్టాన్ని చేయడంతో సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు కంగుతిన్నాయి. ప్రధానంగా బోయింగ్‌ 3 శాతం పతనంకాగా.. కేటర్‌పిల్లర్‌ 2.5 శాతం క్షీణించింది. స్టీల్‌, అల్యూమినియం ధరలు పెరగడం ద్వారా లాభాలు తగ్గవచ్చన్న అంచనాలు దీనికి కారణంకాగా.. సోమవారం డోజోన్స్‌ 157 పాయింట్ల(0.6 శాతం) వెనకడుగుతో 25,179 వద్ద నిలిచింది. ఎస్‌అండ్‌పీ 3 పాయింట్లు(0.15 శాతం) నీరసించి 2,783 వద్ద ముగిసింది.  
నాస్‌డాక్‌ రికార్డ్‌
డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ నష్టపోయినప్పటికీ టెక్నాలజీ దిగ్గజాల అండతో నాస్‌డాక్‌  సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. 27 పాయింట్లు(0.4 శాతం) బలపడి 7,588 వద్ద ముగిసింది. క్వాల్‌కామ్‌ను టేకోవర్‌ చేసేందుకు యూఎస్‌ ట్రెజరీ అంగీకరించకపోవడంతో బ్రాడకామ్‌ 4 శాతం ఎగసింది. నోమురా రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడంతో మైక్రాన్‌ టెక్నాలజీ 9 శాతం జంప్‌చేయగా.. లూమెంటమ్‌ హోల్డింగ్స్‌ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడంతో ఒక్లారో 27 శాతం దూసుకెళ్లింది.Most Popular