ప్రతికూల ఓపెనింగ్‌ చాన్స్‌?! 

ప్రతికూల ఓపెనింగ్‌ చాన్స్‌?! 

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా  ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 18 పాయింట్లు క్షీణించి 10,414 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో సోమవారం ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో హైజంప్‌ చేశాయి. సెన్సెక్స్‌ 624 పాయింట్లు దూసుకెళ్లి 33,931కు చేరగా.. నిఫ్టీ 197 పాయింట్లు జంప్‌చేసి 10,424 వద్ద స్థిరపడింది. దీంతో నేడు కొంతమేర లాభాల స్వీకరణకు అవకాశమున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. 

నిఫ్టీ కదలికలు ఇలా..!
నేడు నిఫ్టీ ఊపందుకుంటే..  తొలుత 10,471 పాయింట్ల వద్ద, తదుపరి 10,521 స్థాయిలోనూ రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని  సాంకేతిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ నిఫ్టీ బలహీనపడితే తొలుత 10,333 పాయింట్ల వద్ద, తదుపరి 10,245 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని అంచనా వేశారు. 

ఎఫ్‌పీఐల పెట్టుబడులు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) శుక్రవారం రూటు మార్చి నగదు విభాగంలో రూ. 550 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా... సోమవారం మరోసారి రూ. 375 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. అయితే గత కొంతకాలంగా పెట్టుబడుల బాటలో సాగుతున్న దేశీ ఫండ్స్‌(డీఐఐలు) సోమవారం రూ. 464.5 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. శుక్రవారం సైతం డీఐఐలు స్వల్పంగా రూ. 65 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.

 Most Popular