షార్ట్ టెర్మ్‌లో లాభాలిచ్చే సత్తా ఉన్న 15 స్టాక్స్

షార్ట్ టెర్మ్‌లో లాభాలిచ్చే సత్తా ఉన్న 15 స్టాక్స్

బడ్జెట్ అనంతరం మొదలైన మార్కెట్ కరెక్షన్ సూచీలను నేల చూపులు చూసేలా చేస్తోంది. ముఖ్యంగా మార్చి 1 నుంచి 9 తేదీల మధ్య మార్కెట్ సెషన్లను గమనించినట్లయితే సుమారు నిఫ్టీ-50 సూచీ 232 పాయింట్లు నష్టపోయింది. మార్చి 1 న నిఫ్టీ  10,458 వద్ద గరిష్ట స్థాయి నుంచి కరెక్షన్ కు గురై మార్చి 9 నాటికి 10,226కు పతనమైంది. అదే సమయంలో సెన్సెక్స్ 740 పాయింట్లు పతనమైంది. అంటే సుమారు 2.17 శాతం నష్టపోయింది. అదే విధంగా వీక్లీ చార్ట్స్ ను గమనించినట్లయితే 20 వారాల సింపుల్ మువింగ్ యావరేజీ, 40 వారాల ఎక్స పోనెన్షియల్ మూవింగ్ యావరేజి స్థాయికి పతనమైంది. దీన్ని బట్టి కేవలం డెయిలీ చార్ట్స్ మాత్రమే కాదు వీక్లీ చార్ట్స్ కూడా బేరిష్ మోడ్ లోకి జారుకున్నట్లు గమనించవచ్చు. 

ఈ నేపథ్యంలో బేరిష్ ట్రెండ్ లోనూ కేవలం నాలుగు వారాల్లో లాభాలు అందించే ఓ 15 స్టాక్స్ ను పలు బ్రోకరేజీ సంస్థలు, స్టాక్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.    

అనలిస్ట్ : సుమిత్ బగాడియా, హెడ్ ఆఫ్ టెక్నికల్ రిసెర్చ్ డెస్క్ సిఫార్సులు

మ్యాన్ ఇండస్ట్రీస్ :  BUY | టార్గెట్ : రూ. 137 | స్టాప్ లాస్ రూ. 115 
వీక్లీ చార్ట్స్ పరంగా చూసినట్లయితే ఈ స్టాక్ 21 వారాల మూవింగ్ యావరేజీ ఎగువన ట్రేడవుతోంది. అంతేకాదు మీడియం ట్రెండ్ సైతం అప్ సైడ్ లో ఉంది. అలాగే డెయిలీ చార్ట్ పరంగా చూసినా బుల్లిష్‌ కాండిల్‌ స్టిక్‌ పాటర్న్‌ ఏర్పరచుకుంది. రోజువారి చార్ట్స్ పరంగా చూసినా ఆర్‌ఎస్‌ఐ తదితర ఇండికేటర్లు పాజిటివ్‌గా ఉన్నాయి.  

కజారియా సిరామిక్స్ : BUY | టార్గెట్ ధర : రూ. 627 | స్టాప్ లాస్ : 542
డెయిలీ చార్ట్స్ పరంగా చూసినట్లయితే ఈ స్టాక్ షార్ట్ టర్మ్ ట్రెండ్ లో పాజిటివ్ గా కనిపిస్తోంది. అంతేకాదు డౌన్‌వార్డ్ స్లోపింగ్ ట్రెండ్ నుంచి కోలుకోవడాన్ని ఈ స్టాక్‌కు పాజిటివ్‌గా చెప్పచ్చు. ఈ స్టాక్‌లో కరెక్షన్ పూర్తయి, బుల్ ట్రెండ్‌లోకి మారుతుండడంతో కొనుగోలుకు అనుకూల సూచనలు కనిపిస్తున్నాయి. ఎంఎసిడి ఇండికేటర్‌ కూడా బుల్లిష్‌గా ఉంది.  

రాకేష్ భన్సాల్ , వైస్ ప్రెసిడెంట్, ఆర్ కే గ్లోబల్  సిఫార్సులు 

కాస్ట్రల్ ఇండియా :  BUY | టార్గెట్ : రూ. 212 | స్టాప్ లాస్ : రూ.195
ఈ స్టాక్ గత జనవరి 29 నాటి గరిష్ట స్థాయిలో ప్రస్తుతం ట్రేడవుతోంది. ఈ స్టాక్ కేవలం సూచీల పరంగానే కాదు. ఫండమెంటల్ పరంగానూ చాలా బలంగా ఉంది. అంతేకాదు త్రైమాసిక ఫలితాల్లో రెవిన్యూ 16 శాతం గ్రోత్ కనపడగా, కమర్షియల్ వెహికిల్ సెగ్మెంట్ లో నెలకొన్న డిమాండ్ కంపెనీ పెర్ఫార్మెన్స్ పై ప్రభావితం చేసే అవకాశం ఉంది. 

థామస్ కుక్ :  BUY | టార్గెట్ : రూ. 295 | స్టాప్ లాస్ : రూ. 239
ఈ స్టాక్ మార్కెట్ కరెక్షన్ కు దూరంగా ఉండటం గమనార్హం. ముఖ్యంగా ఈ స్టాక్ ను ఏకంగా ఫిక్స్ డ్ డిపాజిట్ తరహాలో ఇన్వెస్ట్ చేసుకునే స్థాయిలో ఉందని సిఫార్సు చేస్తున్నారు. రానున్న ఏడాది కాలంలో చక్కటి రిటర్న్ అందించే అవకాశం ఉందని సూచిస్తున్నారు.  

మిలన్ వైష్ణవ్, టెక్నికల్ అనలిస్ట్, జెమ్ స్టోన్ ఈక్విటీ రిసెర్చి సిఫార్సులు

హిందుస్తాన్ జింక్ :  BUY | టార్గెట్ : రూ. 328 | స్టాప్ లాస్ : రూ. 307 
ఈ స్టాక్ కరెక్షన్ నుంచి రికవరీ అవుతూ రావడంతో పాటు 50 రోజుల మూవింగ్ యావరేజీ అలాగే 100 రోజుల మూవింగ్ యావరేజీని కాపాడుకుంది. కాండిల్ చార్ట్స్ పరంగా చూసినట్లయితే  లాంగ్ లోచర్ షాడో కనబరుస్తుండగా, ఈ స్థాయి నుంచి స్టాక్ మొమెంటమ్ కనిపించే అవకాశం ఉంది. ఆర్ఎస్ఐ పరంగా చూసినా హైయర్ బాటమ్ వైపు సూచిస్తుండగా, షార్ట్ టెర్మ్‌లో ఈ స్టాక్ కొనుగోలు సంకేతాలు కనిపిస్తున్నాయి.  

కాపిటల్ ఫస్ట్ :  BUY | టార్గెట్ : రూ. 670 |  స్టాప్ లాస్ : రూ. 630
గత కొన్ని వారాలుగా కరెక్షన్ ఎదుర్కొన్న ఈ స్టాక్ ప్రస్తుతం రికవరీ బాట పట్టింది. ఈ స్టాక్ లో టెక్నికల్ పుల్ బ్యాక్ కనిపిస్తోంది. అంతేకాదు రూ. 620-645 వద్ద బేస్ ఏర్పరచుకుంటుండగా, ఈ రేంజ్ లో కొనుగోలు చేసేందుకు అనుకూలంగా ఉంది. ఆర్ఎస్ఐ సైతం ఓవర్ సోల్డ్ ఏరియా నుంచి బయటపడటంతో పాటు బాటమ్ ఫార్మేషన్ లో బుల్లిష్ ట్రెండ్ కనిపిస్తోంది. రానున్న రోజుల్లో టెక్నికల్ గా బుల్లిష్ ట్రెండ్ లో స్టాక్ మూమెంట్ కనిపిస్తోంది. 

హెచ్ డీఎఫ్ సీ సెక్యురిటీస్ సిఫార్సులు 

ఒబెరాయ్ రియాలిటీ :  BUY | టార్గెట్ : రూ. 600 | స్టాప్ లాస్ : రూ. 630
ప్రస్తుతం మార్కెట్ లో ఈ స్టాక్ టెక్నికల్ గా బలంగా కనిపిస్తోంది. అంతేకాదు ఈ స్టాక్ కింది రూ.471 లో నుంచి నుంచి షార్ప్ గా బౌన్స్ బ్యాక్ అవుతోంది. వాల్యూమ్స్ పరంగా కూడా బలమైన మూవ్ మెంట్ కనబరుస్తోంది. ఈ స్టాక్ 13 రోజుల ఎస్ఎమ్ఎ, అలాగే 50 రోజుల ఎస్ఎంఎ ఎగువన ట్రేడవుతోంది. 

బ్లూస్టార్ :  BUY | టార్గెట్ : రూ. 870 | స్టాప్ లాస్ : రూ. 762
బ్లూస్టార్ ఈ వారంలోనే రూ.715-763 రేంజ్ నుంచి బ్రేకవుటై, అబౌ యావరేజ్ లెవల్స్ వద్ద ట్రేడవుతోంది. ఈ స్టాక్ ఈ రేంజ్ నుంచి పాజిటివ్ గా మూవ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్టాక్ ఓవర్ బాట్ జోన్ లో లేనప్పటికీ ప్రస్తుతం కొనుగోలు సంకేతాలను కలిగి ఉంది. 

సమీత్ చవాన్, చీఫ్ అనలిస్ట్, టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ , ఎంజెల్ బ్రోకింగ్ 

బ్యాంక్ ఆఫ్ బరోడా :  BUY | టార్గెట్ : రూ. 142 | స్టాప్ లాస్ : రూ. 128
పీఎస్‌యూ బ్యాంకులన్నీ గత మూడు వారాలుగా కంటిన్యూగా నెగిటివ్ ట్రెండ్ చూపిస్తున్నప్పటికీ ఈ స్టాక్ మాత్రం గత మూడు సెషన్లుగా చిన్న స్టాప్ లాస్ వద్ద కొనుగోలు చేసే సూచనలు ఇస్తోంది. చిన్నపాటి రిస్క్ ఉన్నప్పటికీ, ప్రస్తుత రేంజ్ నుంచి కొద్ది శాతం మేర లాభపడే సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న వారం రోజుల్లో రూ.142 టార్గెట్ రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.     

మజర్ మహమ్మొద్, చీఫ్ స్ట్రాటజిస్ట్, టెక్నికల్ రిసెర్చి అండ్ ట్రేడింగ్ అడ్వైజరీ, చార్ట్ వ్యూ ఇండియా డాట్ ఇన్ 

హావెల్స్ ఇండియా :  BUY | టార్గెట్ : రూ. 521-550 | స్టాప్ లాస్ : రూ. 490
మార్కెట్ సూచీలతో పోల్చిచూస్తే ఈ స్టాక్ పై స్థాయిలోనే ట్రేడవుతోంది. మార్కెట్ కరెక్షన్ తో పోల్చి చూసిన ఈ స్టాక్ తక్కువగానే కరెక్షన్ కు గురైంది. రూ. 520-490 కన్సాలిడేటింగ్ జోన్ గా కనిపిస్తోంది. టార్గెట్ రూ.521 నిర్ణయించుకున్నా, ఈ స్టాక్ హయ్యర్ టార్గెట్ రూ.550 వరకూ చేరుకునే అవకాశం ఉంది.  


హిందుస్తాన్ యూనిలివర్ : BUY | టార్గెట్ : రూ. 1360 | స్టాప్ లాస్ : 1280
రూ.1299 వద్ద ఈ స్టాక్ సపోర్టింగ్ లెవల్ చేరుకుంటున్నప్పటికీ, సెల్లింగ్ ప్రెజర్‌కు లోను కావడం లేదు. రూ.1290 వద్ద స్థిరంగా బేస్ ఏర్పరచుకోనుంది. ఈ స్థాయినుంచి పుల్ బ్యాక్ కు గురైతే స్టాక్ టార్గెట్ స్వల్పకాలంలోనే టార్గెట్ చేరుకునే అవకాశం ఉంది.   


ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ : BUY | టార్గెట్ : రూ. 1270 | స్టాప్ లాస్ : రూ. 1180
ప్రస్తుతం ఈ స్టాక్ 200 రోజుల మూవింగ్ యావరేజి వద్ద కన్సాలిడేటింగ్ కు గురువుతోంది. కనిష్ట స్థాయి 1190 రూ.లు వరకూ పతనమైన ఈ స్టాక్ ఒక డీసెంట్ పుల్ బ్యాక్ తో రూ.1270 వరకూ వెళ్లే అవకాశం ఉంది.

టీసీఎస్ : BUY | టార్గెట్ : రూ. 3259  | స్టాప్ లాస్ :రూ. 2970
ఈ  స్టాక్ ప్రస్తుతం స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కు లోనవుతోంది. మార్కెట్స్ ప్రెజర్ లో ఉన్నప్పటికీ ఈ స్టాక్ మాత్రం డీసెంట్ గా కదలికలు కనబరుస్తోంది. ఈ స్టాక్ బాటమ్ లెవల్ లో 2977 వరకూ టచ్ చేసినప్పటికీ, ప్రస్తుతం అప్ ట్రెండ్ లో ఉంది. ఈ అప్ ట్రెండ్ కొనసాగినట్లయితే జనవరి  31 నాటి లైఫ్ టైం హై రూ. 3,259 స్థాయిని  తాకే అవకాశం ఉంది. 3127 లెవల్స్ వద్ద రెసిస్టెన్స్ లోనయ్యే అవకాశం ఉన్నప్పటికీ, బుల్స్ జోరుతో ఈ అడ్డంకిని కూడా దాటవచ్చు. 

వికాస్ జైన్, సీనియ్ రిసెర్చి ఎనలిస్ట్, రిలయన్స్ సెక్యూరిటీస్ 

పివీఆర్ : BUY | టార్గెట్ : రూ. 1450-1500 | స్టాప్ లాస్ : రూ.1235
ఈ స్టాక్ ప్రస్తుతం బుల్లిష్ ట్రెండ్ లో కనిపిస్తోంది. ముఖ్యంగా 100 రోజుల మూవీంగ్ యావరేజీ వద్ద సపోర్ట్ తీసుకొని హెల్తీ రివర్సల్ కనబరుస్తోంది. ఈ స్టాక్ రీబౌండ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.  

ఎస్కార్ట్స్ ఇండియా : BUY | టార్గెట్ : రూ.905-920   | స్టాప్ లాస్ : రూ. 830
ఈ స్టాక్ 20 డేస్, 50 డేస్ మూవింగ్ యావరేజ్ వద్ద హయ్యర్ లెవల్స్ లో షార్ప్ డిక్లైన్ యాక్షన్ కనపరిచినప్పటికీ, ప్రస్తుతం పాజిటివ్ క్రాస్ ఓవర్ అరౌండడ్ జోన్ లో ప్రవేశించింది. దీంతో సెల్లింగ్ ఇంట్రెస్ట్ తగ్గుముఖం పట్టింది. అంతేకాదు ఆర్ఎస్ఐ, ఎంఏసీడీ సూచీలు సైతం స్థిరంగా తగ్గుతూ వచ్చాయి. ఈ స్టాక్ మరోసారి బౌన్స్ బ్యాక్ అయ్యే సూచనలు ఉన్నాయి.  Most Popular