ఆంధ్రాబ్యాంక్‌ షేరు ఇంత పడింది.? ఇప్పుడు కొనొచ్చా..?

ఆంధ్రాబ్యాంక్‌ షేరు ఇంత పడింది.? ఇప్పుడు కొనొచ్చా..?

అసలు ఇది ప్రభుత్వరంగ బ్యాంకులకు కష్టకాలం..అందులోనూ అది ఆంధ్రాబ్యాంక్. లిస్టింగ్ రోజు నుంచి ఈ షేరులో కనీసం రెండ్రూపాయల వడ్డీ కూడా గిట్టుబాటు కాలేదని వాపోయేవాళ్లు ఉన్నారు..ఇప్పుడదే షేరు 14ఏళ్ల కనిష్టస్థాయికి పడిపోయింది. అంటే ఒక తరంతో సమానం. రూ.33.40కి పతనమైన ఈ షేరు ఐపిఓకి వచ్చినప్పుడు రూ.62వద్ద కొనుగోలు చేసినవాళ్లున్నారు..అక్కడ్నుంచి ఏ రోజునా ఈ షేరు కదలికలపై స్టాక్ మార్కెట్లో కలకలం రేగింది లేదు. పెరిగింది లేదు..తగ్గింది లేదు..ఐతే ప్రతి ఏటా డివిడెండ్లు మాత్రం పంచిపెడుతూ ఉంది. నవంబర్ 4, 2010న మాత్రం రూ.181.25స్థాయికి ఎగసింది. గత ఏడాది కాలం గమనిస్తే..మే 5, 2017న రూ.72 వరకూ చేరింది.ఐతే ఇప్పుడు ఈ పతనానికి కారణం వరసగా బ్యాంకుల్లో జరుగుతున్న మోసాలకు ఇది కూడా తోడు కావడమే..
 మాజీ డైరక్టర్ ఒకరు రూ.5వేలకోట్ల రూపాయల మోసంలో చిక్కుకుపోవడంతో ఆంధ్రాబ్యాంకు షేరు పతనం కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి సదరు వ్యక్తిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ పరిణామాలతో షేరు నష్టపోతోంది. 2004 మే 17న ఆంధ్రాబ్యాంక్ షేరు రూ.30లుగా నమోదు అయింది. ప్రస్తుతం ఆంధ్రాబ్యాంక్‌లో బైటపడిన మోసంలో ఈడీ విచారణలో తేలిన అంశాలు చూస్తే ఆశ్చర్యపోకతప్పదు. 2011లో ఇన్ కంట్యాక్స్ అధికారులు గార్గ్ అనే ఆంద్రాబ్యాంక్ డైరక్టర్ డైరీని సీజ్ చేశారు. ఆ డైరీలో ఏముందంటే చేతన్ జయంతిలాల్ సందేశారా, నితిన జయంతిలాల్ సందేశారా అనే స్టెర్లింగ్ బయోటెక్ డైరక్టర్లు ఇతగాడికి 15.2 మిలియన్ల మేర డబ్బు చెల్లించినట్లు ఎంట్రీలు ఉన్నాయ్. ఈ చెల్లింపులు 2008-09 మధ్య జరిగిన లావాదేవీలుగా ఎన్ ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితేష్ రాణా చార్జ్ షీట్‌లొ ఆరోపించారు. ఈ చెల్లింపులపైనే ఇప్పుడు కేసు విచారణ సాగుతోంది. గార్గ్ ఇలా కోటిన్నర రూపాయలకి పైగా ముడుపులు అందుకుని స్టెర్లింగ్ బయోటెక్ సంస్థకి రుణాల వితరణ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయ్. అందుకే సంస్థలో ఇంత మేర మోసం జరిగిందని తెలుస్తుంది..ఇది బైటపడిన ఒక్క ఖాతా విలువే ఇలా రూ.5వేలకోట్లకి పైగా ఉంటే..మరి మొండిబకాయిల రూపంలో ఇంకెన్ని ఉంటాయో అనే సందేహం రావడం సహజం..ఐతే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు స్టాక్ మార్కెట్లో కదలికలు కూడా ఇలానే ప్రతికూలంగా ఉంటాయి కాబట్టి ఆంద్రాబ్యాంక్ షేరు దీనావస్థలో పడింది. ఇప్పటికే పాతికలక్షలమేర షేర్లు చేతులు మారాయ్.  మరోవైపు స్టెర్లింగ్ బయోటెక్ సింగిల్ డిజిట్‌లో ట్రేడవుతూ విధ్వంసం పాలైంది. అందులోనూ ఈ షేరు జెడ్ గ్రూప్‌లో ఉండటం గమనించాలి. లిస్టింగ్ నిబంధనలు, ఇన్వెస్టర్ల కంప్లైంట్ను పట్టించుకోని.. పాటించని కంపెనీలను ఎన్ఎస్‌డిఎల్, సిఎస్‌డిఎల్ సంస్థలు ఇలా Z గ్రూప్‌లో వేస్తాయి. పైన పేర్కొన్న వివరాల ప్రకారం ఆంధ్రాబ్యాంక్ షేరు జోలికి ఇప్పట్లో పోవద్దనేది అనలిస్టులు సలహాMost Popular