వెంటనే కొనేందుకు అనువుగా ఉన్న 5 స్టాక్స్‌!!

వెంటనే కొనేందుకు అనువుగా ఉన్న 5 స్టాక్స్‌!!

ఐడీఎఫ్‌సీ బ్యాంక్
బ్రోకరేజ్ హౌస్: క్రెడిట్ స్యూయిస్| రేటింగ్: న్యూట్రల్ | టార్గెట్ రూ. 55
గత మూడేళ్లలో 5 నాన్ బ్యాంకింగ్ సంస్థలు బ్యాంకులుగా అవతరించాయి. వీటిలో ఐడీఎఫ్‌సీ బ్యాంక్ వృద్ధి ఇప్పటివరకూ బలహీనంగా ఉంది. రుణా వృద్ధి రేటు పెరగకపోవడాన్ని ఈ బ్యాంకుకు ఇప్పటివరకూ నెగిటివ్‌ పాయింట్‌గా చెప్పవచ్చు. కేపిటల్ ఫస్ట్‌తో మెర్జర్ తర్వాత భారీ వృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి.

 

కోల్ ఇండియా
బ్రోకరేజ్ హౌస్: నోమురా| రేటింగ్: న్యూట్రల్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కోల్ ఇండియా ఒక్కో షేరుకు రూ. 16.50 డివిడెండ్ ప్రకటించడాన్ని.. పాజిటివ్ అంశంగా నోమురా చెబుతోంది. ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ కారణంగా రూ. 12320 కోట్ల క్యాష్‌ను బదలాయించనున్నారు. ఇందులో ప్రభుత్వానికి రూ. 10,120 కోట్లు దక్కనున్నాయి. ఏడాది చివరలో నామమాత్రపు ఫైనల్ డివిడెండ్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

 

ఐటీసీ & యూఎస్ఎల్
బ్రోకరేజ్ హౌస్: డాయిష్ బ్యాంక్| రేటింగ్: బయ్
జీఎస్‌టీ మీట్‌లో సిగరెట్ & ఈఎన్ఏ లపై అదనపు ట్యాక్స్ విధించే అంశంపై ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ డాయిష్ బ్యాంక్ చెబుతోంది. ఇది కొన్ని స్టాక్స్‌కు సానుకూల విషయం. హెచ్‌యూఎల్, డాబర్, నెస్ట్‌లే, జీఎస్‌కే కన్జూమర్ లతో పోల్చితే ఐటీసీ అధికంగా లాభపడనుంది. 

 

మారుతి సుజుకి
బ్రోకరేజ్ హౌస్: డాయిష్ బ్యాంక్| రేటింగ్: బయ్| టార్గెట్ రూ. 10,000
ప్రతికూలతలు ఎదురవుతాయనే అంచనాల కారణంగా గతేడాది కాలంలో ఈ స్టాక్ 10 శాతం మేర క్షీణించింది. ఫారెక్స్, ముడి పదార్ధాలు మార్జిన్స్‌కు రిస్క్‌గా మారాయి. కానీ అంచనాలతో పోల్చితే వీటి ప్రభావం వాస్తవంగా తక్కువగానే ఉంది. 
 Most Popular