వచ్చేవారానికి గణాంకాలపై మార్కెట్ల దృష్టి!

వచ్చేవారానికి గణాంకాలపై మార్కెట్ల దృష్టి!

వచ్చే వారానికి స్టాక్‌ ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆర్థిక గణాంకాలపై దృష్టి సారించనున్నారు. సోమవారం(12న) ఫిబ్రవరి నెలకు వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. అంతేకాకుండా జనవరి నెలకు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) సైతం ప్రభుత్వం విడదల చేయనుంది. జనవరిలో సీపీఐ 5.07 శాతం పుంజుకోగా... డిసెంబర్‌లో ఐఐపీ 7.1 శాతం వృద్ధి చూపింది. ఈ బాటలో ఫిబ్రవరి టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు 14న ప్రభుత్వం ప్రకటించనుంది. జనవరిలో డబ్ల్యూపీఐ 2.84 శాతం ఎగసింది.
జీఎస్‌టీ సమావేశం నేడు
నేడు(శనివారం) ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అధ్యక్షతన జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంకానుంది. జీఎస్‌టీ రిటర్నుల ఫైలింగ్‌ను సులభతరం చేసేందుకు వీలుగా నిర్ణయాలు తీసుకోనుంది. దీంతోపాటు 2018 ఏప్రిల్‌ 1 నుంచి ఈ వే బిల్లుకు తెరతీయనున్నట్లు తెలుస్తోంది. 
ఇతర అంశాలూ కీలకమే
ఆర్థిక గణాంకాలతోపాటు విదేశీ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం వంటి ఇతర అంశాలు సైతం వచ్చే వారం దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 13న అమెరికా సీపీఐ గణాంకాలు వెల్లడికానున్నాయి. 14న యూఎస్‌ రిటైల్‌ సేల్స్‌ డేటా విడుదలకానుంది. ఇవి అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశమున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');