లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ భయం లేదిక

లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ భయం లేదిక

లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్ ట్యాక్స్ భయాలు వీడుతున్నట్లే కన్పిస్తున్నాయ్. ఇందుకు ఫిబ్రవరి నెలలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల తీరు నిదర్శనంగా కన్పిస్తుంది. జనవరి నెలకంటే గతనెలలో ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులు పెరగడంతో ఈ విషయంపై వ్యాపార నిపుణులు ఈ అంచనాకు వచ్చారు

ఏ స్టాక్ కొన్నా, లేదా ఈక్విటీ సంబంధింత మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టినా ...లాభం లక్షదాటితే పదిశాతం పన్ను కట్టాల్సిందే.ఇదీ కొత్త లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్ ట్యాక్స్ విధానం. దీంతో స్టాక్ మార్కెట్లలో పతనం భారీగా నమోదు అయింది. ఐతే అప్పట్లోనే ఈ నష్టాలకు ఎల్ సిజిటి కారణం కాదని చాలామంది చెప్పారు. అదే ఇప్పుడు నిజమైందనేలా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు నిరూపిస్తున్నాయ్. జనవరి నెల కంటే ఫిబ్రవరినెలలో ఈ రంగంలో పెట్టుబడులు దాదాపు 1200కోట్ల మేర పెరగడమే ఇఁదుకు కారణం. ఓవరాల్‌గా చూసుకుంటే జనవరి కంటే ఫిబ్రవరిలో మ్యూచువల్ ఫండ్ల రాబడి స్వల్పంగా తగ్గింది..ఐతే ఒక్క ఈక్విటీ లెక్కలు చూస్తే రూ.14,683కోట్ల మేర మదుపరులు పెట్టుబడి చేశారు. అదే అంతకు ముందు నెల చూస్తే వీటి విలువ రూ.13404కోట్లు. మొత్తం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల విలువ రూ.22.2లక్షలకోట్లుగా అంచనా..ఇంత భారీ మార్కెట్ ఉన్న మ్యూచువల్ ఫండ్ బిజినెస్‌పై లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ప్రభావం భారీగా ఉండొచ్చనే అంచనా బడ్జెట్ తర్వాతి రోజుల్లో బలంగా ఉఁది..ఐతే తాజా గణాంకాలతో ఫండ్ హౌస్‌లు కాస్త ఊపిరి పీల్చుకున్నాయ్

ఫిబ్రవరి నెలలో నిఫ్టీ దాదాపు 5శాతం నష్టపోయినా..ఇన్వెస్టర్లు ఎంఎఫ్‌లవైపు చూడటానికి కారణాలున్నాయ్. మార్కెట్ల దిద్దుబాటు కోసం ఎదురుచూస్తున్న మదుపరులు, సంస్ధాగత ఇన్వెస్టర్లు కూడా ఇప్పుడు కొత్తగా కొనుగోళ్లు చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత వచ్చిన భారీ కరెక్షన్ కావడంతో ఎక్కువమంది ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారని రిలయన్స్ నిప్పాన్ అసెట్ మేనేజ్ మెంట్ అభిప్రాయపడుతోందిMost Popular