హెచ్‌జీ ఇన్‌ఫ్రా లిస్టింగ్‌ నేడు!

హెచ్‌జీ ఇన్‌ఫ్రా లిస్టింగ్‌ నేడు!

మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ కంపెనీ హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌ నేడు స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. షేరుకి రూ. 270 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 462 కోట్లను సమీకరించింది. ఇష్యూ ఫిబ్రవరి 28న ముగిసింది. ఇష్యూ నిధులను పరికరాల కొనుగోలు, రుణాల చెల్లింపు, సాధారణ పాలనా వ్యవహారాలకు వినియోగించనున్నట్లు కంపెనీ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. 
యాంకర్‌ నిధుల సమీకరణ
యాంకర్‌ ఇన్వెస్టర్ల ద్వారా కంపెనీ శుక్రవారం(23న) రూ. 138 కోట్లను సమీకరించింది. 11 సంస్థలు షేరుకి రూ. 270 ధరలో ఇన్వెస్ట్‌ చేశాయి. 51 లక్షలకుపైగా షేర్లను యాంకర్‌ సంస్థలకు హెచ్‌జీ ఇన్‌ఫ్రా కేటాయించింది. వీటిలో ఎస్‌బీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌, డీఎస్‌పీ బ్లాక్‌రాక్‌ ఇండియా టైగర్‌ ఫండ్‌, యూటీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ తదితరాలున్నాయి.
కంపెనీ వివరాలివీ
2003లో ప్రారంభమైన హెచ్‌జీ ఇన్‌ఫ్రా మౌలిక సదుపాయాల రంగంలో ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌(ఈపీసీ) విభాగంలో ప్రధానంగా సర్వీసులు అందిస్తోంది. రహదారులు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్ల నిర్మాణంలో కార్యకలాపాలు విస్తరించింది. వీటితోపాటు నీటిపారుదల ప్రాజెక్టులలోకి సైతం ప్రవేశించింది. రాజస్తాన్‌లో టర్న్‌కీ పద్దతిలో నీటిపారుదల ప్రాజెక్టులను చేపడుతోంది. మహారాష్ట్ర, రాజస్తాన్‌లలో చేపట్టిన ప్రాజెక్టుల ద్వారానే 93 శాతం టర్నోవర్‌ సమకూరుతున్నట్లు కంపెనీ ఎండీ హరేంద్ర సింగ్‌ పేర్కొన్నారు.  



Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');