పతనంలోనూ పరిగెడుతున్న జోడీ స్టాక్స్ !

పతనంలోనూ పరిగెడుతున్న జోడీ స్టాక్స్ !

మార్కెట్లు పతనంలో ఉన్నప్పటికీ ఎఫ్‌డీసీ, వీమార్ట్ రిటైల్ స్టాక్స్ మాత్రం రికార్డు హైలో ట్రేడవుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో దాదాపు అన్ని సెక్టార్లలోని స్టాక్స్ 52 వారాల గరిష్ట స్థాయి నుంచి కరెక్టవుతూ వస్తున్నాయి. అందుకు ఈ రెండు స్టాక్స్ మినహాయింపు అనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఎఫ్‌డీసీ మాత్రం బుధవారం మార్కెట్ ట్రేడింగ్ లో ఇంట్రాడేలో 11 శాతం హైని తాకి రూ.319 వద్ద గరిష్ట స్థాయిని నమోదు చేసింది. వాల్యూమ్స్ పరంగా చూసినా, మొత్తం 10.5 లక్షల షేర్లు చేతులు మారాయి. 

గత నెల ఫిబ్రవరి 7న ఈ ఫార్మాసుటికల్ కంపెనీ ఒక్కో షేరుకు రూ. 350 వద్ద బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు అంగీకారం తెలిపింది. దీంతో ఈ షేర్ బై బ్యాక్ తేదీ అయిన ఫిబ్రవరి 28 నాటికి  ఒక్కసారిగా 41 శాతం పెరిగింది. కంపెనీ క్యూ 3 ఫలితాలు సైతం అద్భుతమైన పెర్ఫార్మన్స్ ను చూపించింది. కంపెనీ నెట్ ప్రాఫిట్ 94 శాతం పెరిగింది. 

ఇక మరో స్టాక్ వీ మార్ట్ రిటైల్ కూడా మార్కెట్ పతనంలో నూతన రికార్డును నమోదు చేసింది. గత నాలుగు సెషన్లుగా 16 శాతం పెరగగా, ఇంట్రాడేలో 7 శాతం పెరిగింది. ఇక గత నెల రోజుల చార్ట్స్ చూస్తే వీమార్ట్ ఏకంగా 34 శాతం వ్రుద్ధి చెందింది. రిటైల్ మార్కెట్ చెయిన్ సంస్థ గా పేరొందిన వీమార్ట్ మొత్తం ఎక్కువగా చిన్న పట్టణాల్లో విస్తరించేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది. గత డిసెంబర్ క్వార్టర్ ఫలితాలనూ చూస్తే ఈ కంపెనీ ఆపరేషన్స్ పరంగా రెవెన్యూ 13 శాతం పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ 27 శాతం పెరిగింది. 

గత సంవత్సర కాలంగా చూసినప్పటికీ వీమార్ట్ షేర్ ధర వరుసగా అప్ సైడ్ ట్రెండ్ నడుస్తోంది. బలమైన గ్రోత్  రేట్, స్థిరమైన ఆర్థిక ఫలితాలు ఈ రన్ కు దోహదపడుతున్నాయని సిస్టమేట్రిక్స్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ తెలిపింది. Most Popular