షార్ట్‌ టర్మ్‌ ట్రెండ్ ఎలా ఉండొచ్చు..?

షార్ట్‌ టర్మ్‌ ట్రెండ్ ఎలా ఉండొచ్చు..?

డౌన్‌ ఫాల్‌ షార్ట్‌టర్మ్‌లో కంటిన్యూ అయ్యే అవకాశముందని అవెండస్‌ క్యాపిటల్‌ అల్టర్నేట్‌ స్ట్రాటజీస్‌స్‌ సీఈఓ ఆండ్రూ హాలాండ్‌ అంచనా వేస్తున్నారు. ప్రస్తుత లెవల్స్‌ నుంచి నిఫ్టీ 10 వేల దిగువకు పడపోయే అవకాశముందని ఆయన ఆయన అభిప్రాయపడుతున్నారు. దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లు గత నెల రోజులుగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతోన్నాయి. అయితే ప్రతి కరెక్షన్‌లోనూ కొత్త పొజిషన్స్‌ తీసుకోవాలని, అప్పుడే మార్కెట్లో చక్కని రిటర్న్స్‌ అందుకోవచ్చని ఆయన తెలిపారు.

దిగుమతి సుంకం వార్తలతో మెటల్‌ ధరలు రాబోయే రోజుల్లో తగ్గుముఖం పడుతాయని, ఐటీ కంపెనీల ప్రదర్శన నిరుత్సాహకరంగా ఉంటుందని హాలాండ్‌ అంచనా వేస్తున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 66-67 లెవల్స్‌కు పడిపోతుందన్నారు. పలు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ స్టాక్స్‌ 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయని, అయితే ఈ స్టాక్స్‌లో కొత్త పొజిషన్స్‌ తీసుకునే బదులు ప్రైవేట్‌ బ్యాంకులకు ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు.  పెట్టుబడికి అనుకూలంగా కొన్ని కార్పొరేట్‌ బ్యాంకులు అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నాయని, అయితే ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. Most Popular