కేంద్రానికి ఆర్‌బీఐ అన్ని వేల కోట్లు ఇస్తుందా?

కేంద్రానికి ఆర్‌బీఐ అన్ని వేల కోట్లు ఇస్తుందా?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతీ ఏటా కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌ను చెల్లిస్తూ ఉంటుంది. సహజంగా ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు ఆర్థిక సంవత్సరం ఉంటే.. ఆర్బీఐ మాత్రం జూలై నుంచి జూన్ వరకు ఏడాదిని లెక్కిస్తారు. 

2017-18 తొలి ఆరు నెలల కాలానికి రిజర్వ్ బ్యాంక్ నుంచి కేంద్రం రూ. 10 వేల కోట్ల రూపాయలను.. డివిడెండ్ ‌రూపంలో కేంద్రం ఆశిస్తోంది. ఈ మొత్తాన్ని మార్చ్ నెలలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

గతంతో పోల్చితే ఇప్పుడు ఆర్బీఐ చెల్లించే డివిడెండ్లు బాగా తగ్గిపోయాయి. గతేడాది అయితే.. ఐదు సంవత్సరాల కనిష్ట స్థాయిలో డివిడెండ్ చెల్లించింది ఆర్బీఐ. తమకు వస్తున్న నిధులు తగ్గిపోవడంతో అదనపు చెల్లింపులు చేయాలంటూ కేంద్రం అభ్యర్ధించినా.. ఆర్బీఐ మాత్రం తిరస్కరించింది.

అయితే.. ఇప్పుడు కేంద్రం ఆశించిన స్థాయిలోనే డివిడెండ్ చెల్లింపులు ఉంటాయని.. దాదాపు రూ. 10 వేల కోట్ల రూపాయలను మధ్యంతర డివిడెండ్ రూపంలో కేంద్రానికి త్వరలోనే చెల్లించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. Most Popular