ఈ స్టాక్స్‌పై ఓ కన్నేయండి (మార్చి 5)

ఈ స్టాక్స్‌పై ఓ కన్నేయండి (మార్చి 5)

సోమవారం ట్రేడింగ్‌లో Sunflag Iron And Steel Company, Eicher Motors, Matrimony.Com, Steel Strips Wheels, Dilip Buildcon షేర్లల్లో సిగ్నిఫికెంట్‌ మూమెంట్‌ వచ్చే ఛాన్స్‌ వుంది. 

Sunflag Iron And Steel: క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ కేర్‌ తమ రుణ రేటింగ్‌ను సవరించినట్టు కంపెనీ తెలిపింది. 

Eicher Motors: ఫిబ్రవరి నెలకుగాను తమ వాణిజ్య వాహనాల అమ్మకాల్లో 20శాతం వృద్ధి నమోదైందని ఐషర్‌ మోటార్స్‌ ప్రకటించింది.

Matrimony.Com: సెకండ్‌ షాదీ డాట్‌కామ్‌ను కొనుగోలు చేసినట్టు మాట్రిమోనీ డాట్‌కామ్‌ ప్రకటించింది. 

Steel Strips Wheels: ఫిబ్రవరి నెలకు గాను తమ ఆదాయంలో 57 శాతం వృద్ధి నమోదైందని స్టీల్‌ స్ట్రిప్స్‌ వీల్స్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. ట్రక్‌ వీల్స్‌ అమ్మకాల్లో గణనీయంగా వృద్ధి నమోదు కావడంతో తమ ఆదాయం పెరిగిందని కంపెనీ తెలిపింది. సోమవారం ట్రేడింగ్‌లో ఈ స్టాక్‌ వెలుగులోకి రావొచ్చు. 

Dilip Buildcon: నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) నుంచి రూ.4473 కోట్ల విలువైన రెండు ఆర్డర్లను సంపాదించినట్టు దిలీప్‌ బిల్డ్‌కాన్‌ ప్రకటించింది.Most Popular