యాస్టర్‌ డీఎం లిస్టింగ్‌.. ఇన్వెస్టర్లకు నిరాశే!

యాస్టర్‌ డీఎం లిస్టింగ్‌.. ఇన్వెస్టర్లకు నిరాశే!

కొచ్చి కేంద్రంగా ఏర్పాటైన యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ లిస్టింగ్‌ తొలి రోజు ఇన్వెస్టర్లకు నిరాశనే మిగిల్చింది. ఇష్యూ ధర రూ. 190కాగా... బీఎస్ఈలో రూ. 10 నష్టంతో 180 వద్ద నిలిచింది. తొలుత రూ. 8 నష్టంతో రూ. 182 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఆపై రూ. 188 వద్ద గరిష్టాన్ని.. రూ. 176 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఈ నెల 15న ముగిసిన ఇష్యూ 1.3 రెట్లు మాత్రమే సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. తద్వారా కంపెనీ రూ. 980 కోట్లు సమీకరించింది. ప్రధానంగా అరబ్‌ దేశాలలో ఆసుపత్రులను నిర్వహిస్తున్నసంస్థ యాస్టర్‌, మెడ్‌కేర్‌, యాక్సెస్‌ బ్రాండ్లతో ఆసుపత్రులు, క్లినిక్‌లు, ఫార్మసీలను నిర్వహిస్తోంది. 
ఇతర వివరాలివీ
అరబ్‌ దేశాలతోపాటు కేరళ, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోనూ ఆసుపత్రులు, క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. తద్వారా వివిధ వైద్య సేవలను అందిస్తోంది. ఆదాయంలో 84 శాతం అరబ్‌ దేశాల నుంచే సమకూరుతుండగా.. దేశీయంగా 16 శాతం సమకూరుతోంది. మొత్తం 19 ఆసుపత్రులు, 4754 బెడ్‌లతో కార్యకలాపాలు విస్తరించింది. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');