ఆస్తుల లెక్కచెప్పేందుకు ఇదే లాస్ట్ ఛాన్స్ - సినీజనాలకు ఐటి శాఖ క్లాస్

ఆస్తుల లెక్కచెప్పేందుకు ఇదే లాస్ట్ ఛాన్స్ - సినీజనాలకు ఐటి శాఖ క్లాస్

గతంలో ఇన్‌కమ్‌ టాక్స్‌ కన్నుగప్పి కూడబెట్టుకున్న ఆస్తులను, డబ్బును ప్రకటించడం ద్వారా భవిష్యత్‌లో విచారణ, శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఇదే సదవకాశమని ఐటీ శాఖ తెలిపింది. అప్రకటిత ఆస్తులను వెల్లడించేందుకు ఆఖరి అవకాశంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదాయ వెల్లడి పథకం, ఐడీసీ-2016 ను సద్వినియోగపర్చుకోవాలని ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ కోరింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని సినీ పరిశ్రమ వర్గాల కోసం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో దాసరి, రాజేంద్రప్రసాద్, వెంకటేశ్, జగపతి బాబు, అల్లు అరవింద్ తో పాటు 24 క్రాఫ్ట్స్ చెందిన సినీ ప్రముఖులు హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ శాఖ ప్రిన్సిపల్ కమిషనర్లు సుశీల్ కుమార్,  పీవీ రావ్‌, ఇన్‌కంటాక్స్‌ అడిషినల్‌ కమీషనర్‌  రాజీవ్ బెంజెవలు  ఈ పథకం ప్రయోజనాలు..  నియమ నిబంధనలను తెలియజేశారు. జూన్ 1న ప్రారంభమైన ఈ పథకం సెప్టెంబర్ 30న ముగియనుంది. 
 

 Most Popular