స్టాక్స్ టు వాచ్ ( 22-02-2018)

స్టాక్స్ టు వాచ్ ( 22-02-2018)

లుపిన్ :  డెమిన్షియా, అల్జీమర్స్ వ్యాధి నివారణలో వాడే మెమంటైన్ హోడ్రోక్లోరైడ్ క్యాప్సుల్స్ యూఎస్ మార్కెట్లో విక్రయించేందుకు ఎఫ్‌డీఏ అనుమతి. దీంతో ఈ షేర్ ధరల్లో నేడు ప్రభావితం కావచ్చు. 

ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి తాడిపత్రి మునిసిపాలిటీలో కేంద్ర స్పాన్సర్డ్ పథకం అమ్రుత్ పనుల కాంట్రాక్ట్ దక్కించుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ. మొత్తం కాంట్రాక్టు విలువ రూ. 135 కోట్లు.

సద్భావ్ ఇన్ ఫ్రా : ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ‌లో జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టులో ఎల్ వన్ బిడ్డర్ గా నిలిచింది. భారత్ మాలా పథకం కింద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా తీర ప్రాంతాల్లో రోడ్లను నిర్మిస్తున్నారు. 

మరికొన్ని స్టాక్స్ : ఏప్రిల్ 2 నుంచి నిఫ్టీ -50 సూచీ నుంచి అంబుజా సిమెంట్, అరబిందో ఫార్మా, బోష్ కంపెనీలను తప్పించునున్నారు. అదే సమయంలో బజాజ్ ఫిన్ సర్వ్, గ్రాసిమ్, టైటాన్ షేర్లకు నిఫ్టీ -50లో చోటు దక్కనుంది. 

ఆదిత్య బిర్లా కాపిటల్, అంబుజా సిమెంట్స్, అరబిందో ఫార్మ, బోష్, జీఐసీ, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, ఎస్ బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నిఫ్టీ నెక్స్ట్ -50 లో చోటు దక్కించుకోనున్నాయి.  Most Popular