చంద్రశేఖరన్ హయాంలో 180% పెరిగిన టాటా స్టాక్స్

చంద్రశేఖరన్ హయాంలో 180% పెరిగిన టాటా స్టాక్స్

గతేడాది ఫిబ్రవరి 21న టాటా గ్రూప్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ నియమితులు అయిన సంగతి తెలిసిందే. ఇవాల్టితో ఆయన బాధ్యతలు చేపట్టి ఏడాది గడిచింది. ఈ సమయంలో టాటా గ్రూప్‌నకు చెందిన టాప్10 స్టాక్స్.. 180 శాతం వరకూ లాభాలను గడించడం చెప్పుకోవాల్సిన విషయం.
టాటా గ్రూప్ ఛైర్మన్ బాధ్యతలను చేపట్టేందుకు ముందుకు.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు ఎండీ అండ్ సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు చంద్ర. మార్కెట్ వాల్యుయేషన్ పరంగా రూ. 5.6 లక్షల కోట్లతో దేశంలోనే రెండో అతి పెద్ద కంపెనీ ఇది.

 

టాటా గ్రూప్‌లో చంద్ర
టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ వంటి కంపెనీల బోర్డులలో 2009-17 మధ్య బాధ్యతలు నిర్వహించారు చంద్రశేఖరన్.
టాటా గ్రూప్‌నకు చెందిన కంపెనీలలో.. టాటా సన్స్ వాటా వైవిధ్య భరితంగా ఉంటుంది. టీసీఎస్‌లో 74శాతం వాటా టాటా సన్స్‌కు చెందగా.. టైటాన్‌లో 21శాతం మాత్రమే ఉంటుంది.

 

పుంజుకున్న షేర్లు
గత ఏడాది కాలంలో టాటా గ్రూప్‌నకు చెందిన పలు కంపెనీల షేర్లు 100 శాతం పైగా లాభాలను గడించాయి. వీటిలో టిన్‌ప్లేట్ కంపెనీ 186 శాతం పెరిగింది. ఆ తర్వాత నెల్కో 102 శాతం ఊపందుకుంది. 
టాటా స్టీల్, వోల్టాస్, టాటా స్పాంజ్, టాటా గ్లోబల్ బెవరేజెస్, ఓరియెంటల్ హోటల్స్, టైటాన్ కంపెనీ షేర్లు 40- 100 శాతం మధ్య లాభాలను గడించాయి. 

 

నష్టపోయిన కంపెనీలు
అయితే టాటా గ్రూప్‌లోని మొత్తం 26 లిస్టెడ్ కంపెనీల్లో 4 మాత్రం ప్రతికూల ఫలితాలను అందించాయి. అత్యధికంగా నష్టపోయిన వాటిలో 19 శాతం నష్టంతో టాటా మోటార్స్ టాప్‌ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత 16 శాతం నష్టంతో టాటా కమ్యూనికేషన్స్, 6 శాతం నష్టంతో ర్యాలీస్ ఇండియా ఉండగా.. టాటా టెలీసర్వీసెస్ అండ్ బెనారస్ హోటల్స్‌ 3 శాతం చొప్పున క్షీణించాయి. Most Popular