యూరప్‌ మార్కెట్లపై వాల్‌మార్ట్‌ ఎఫెక్ట్‌!

యూరప్‌ మార్కెట్లపై వాల్‌మార్ట్‌ ఎఫెక్ట్‌!

మంగళవారం రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ 10 శాతం పతనంకావడంతో భారీగా నష్టపోయిన అమెరికా మార్కెట్ల ప్రభావం యూరప్‌ మార్కెట్లపై కనిపిస్తోంది. దీంతో యూరోపియన్‌ ఇండెక్సులు నీరసంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం యూకే ఇండెక్స్‌ ఎఫ్‌టీఎస్‌ఈ 0.3 శాతం బలహీనపడగా.. ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ, జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌ 0.45 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి.
ఫలితాల సీజన్‌
ఆరెంజ్‌, గ్లెన్‌కోర్‌, అటోస్‌ తదితర దిగ్గజాల ఫలితాలు వెల్లడైనప్పటికీ.. డాయిష్‌ బోర్స్‌, ఐబెర్డోలా, బరాట్‌ డెవలప్‌మెంట్స్‌ నేడు ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఆరెంజ్‌, ఏటస్‌ అటూఇటుగా ఫలితాలు వెల్లడించగా... గ్లెన్‌కోర్‌ దాదాపు 15 బిలియన్‌ డాలర్ల నికర లాభం ప్రకటించింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంకావడం విశేషం! ఏటస్‌ 3.5 శాతం పతనంకాగా.. గ్లెన్‌కోర్‌, ఆరెంజ్‌ 1.5 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి.Most Popular