హెచ్‌డీఐఎల్‌కు ఎఫ్‌అండ్‌వో షాక్‌!

హెచ్‌డీఐఎల్‌కు ఎఫ్‌అండ్‌వో షాక్‌!

ఏప్రిల్‌ 27 నుంచి హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(హెచ్‌డీఐఎల్‌) కౌంటర్లో డెరివేటివ్‌ కాంట్రాక్టులను చేపట్టబోమంటూ నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ) స్పష్టం చేయడంతో ఈ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో హెచ్‌డీఐఎల్‌ 4.3 శాతం పతనమై రూ. 49.25 వద్ద ట్రేడవుతోంది.  
ప్రస్తుత కాంట్రాక్టులు ఓకే
ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ విభాగంలో ఏప్రిల్‌ నుంచీ హెచ్‌డీఐఎల్‌ను తప్పిస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది. అయితే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ 2018 కాంట్రాక్టుల ఎక్స్‌పైరీకి ఎలాంటి ఇబ్బందులూ ఉండవని తెలియజేసింది. Most Popular