మళ్లీ ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ ర్యాలీ!

మళ్లీ ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ ర్యాలీ!

ఈ ఏడాది మూడో క్వార్టర్ ఫలితాలు ప్రకటించాక జోరందుకున్న ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌ కౌంటర్‌కు మరోసారి డిమాండ్‌ పెరిగింది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 7 శాతంపైగా జంప్‌చేసి రూ. 1353 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1376 వరకూ ఎగసింది. డాలరుతో మారకంలో రూపాయి 3 నెలల కనిష్టానికి చేరడంతో తాజాగా మిడ్‌ క్యాప్‌ ఐటీ కంపెనీలు జోరందుకోవడం దీనికి కారణమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. 
నెల రోజుల్లో 24 శాతం అప్‌
గత నెల రోజుల్లో ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ కౌంటర్‌ దాదాపు 24 శాతం దూసుకెళ్లింది. గత మూడు నెలల్లో అయితే దాదాపు 40 శాతం జంప్‌చేసింది. సెప్టెంబర్ క్వార్టర్(క్యూ2)తో పోలిస్తే క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్)లో కంపెనీ నికర లాభం 3 శాతం పెరిగి రూ. 126 కోట్లను అధిగమించగా.. నికర అమ్మకాలు దాదాపు 8 శాతం పుంజుకుని రూ. 969 కోట్లను తాకాయి.Most Popular