పాతాళానికి పడ్డ గీతాంజలి జెమ్స్‌!

పాతాళానికి పడ్డ గీతాంజలి జెమ్స్‌!

గీతాంజలి జెమ్స్‌ కౌంటర్‌ వరుసగా ఆరో రోజు స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 10 శాతం పతనమై రూ. 27.45 వద్ద ఫ్రీజయ్యింది. ఇది చరిత్రాత్మక కనిష్టంకాగా.. గత ఐదు రోజులుగా ఈ కౌంటర్‌ లోయర్‌ సర్క్యూట్‌ను తాకుతూ వస్తున్న సంగతి తెలిసిందే. వెరసి 56 శాతంపైగా పతనమైంది. ఇంతక్రితం ఈ షేరు 2016 మార్చి 1న 30 దిగువకు చేరి రికార్డు కనిష్టాన్ని నమోదు చేసుకుంది. కాగా.. ప్రస్తుతం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో గీతాంజలి ఈక్విటీలో 13 శాతం వాటాకు సమానమైన 15.49 మిలియన్‌ షేర్ల అమ్మకానికి ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి.
స్కామ్‌ షాక్‌
ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) ముంబై బ్రాంచీలో జరిగిన రూ. 11,500 కోట్ల మోసంలో వజ్రాల వ్యాపారీ నీరవ్‌మోడీతోపాటు, గీతాంజలి జెమ్స్‌ చీఫ్‌ మేహుల్‌ చోక్సీకి భాగం ఉన్నట్లు వెల్లడికావడంతో సీబీఐ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఇప్పటికే పలుచోట్ల సోదాలు నిర్వహించగా.. ఆదాయపన్ను శాఖ గీతాంజలి జెమ్స్‌కు చెందిన కొన్ని ఆస్తులనూ సీజ్‌ చేసింది.Most Popular