కొత్త ప్రాజెక్ట్‌తో దిలీప్‌ బిల్డ్‌కాన్‌ అప్‌

కొత్త ప్రాజెక్ట్‌తో దిలీప్‌ బిల్డ్‌కాన్‌ అప్‌

మౌలిక సదుపాయాల సంస్థ దిలీప్‌ బిల్డ్‌కాన్‌ ఈపీసీ ప్రాజెక్ట్‌ను గెలుచుకున్నట్లు వార్తలు వెలువడటంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2 శాతం బలపడి రూ. 934 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 958 వరకూ ఎగసింది. 
రూ. 380 కోట్ల ప్రాజెక్ట్‌
జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) నుంచి కర్ణాటకలో రూ. 380 కోట్ల విలువైన ప్రాజెక్టు బిడ్డింగ్‌ను గెలుపొందినట్లు దిలీప్‌ బిల్డ్‌కాన్‌ పేర్కొంది. దీనిలో భాగంగా కర్టాటక-గోవా సరిహద్దులో రెండు లైన్ల రహదారులను నిర్మించాల్సి ఉంటుందని తెలియజేసింది.Most Popular